
ఎరువులు అందుబాటులో ఉంచాలి
● వర్షాలకు నష్టపోయిన పంటలకు
పరిహారం అందించాలి
● సొసైటీ మహాజన సభల్లో
సభ్యుల తీర్మానం
బిచ్కుంద/పిట్లం/పెద్దకొడప్‌గల్: రైతులకు యూరియా, ఎరువులు తగినంత అందుబాటులో ఉంచాలని వివిధ గ్రామాల సొసైటీలు మహాజన సభల్లో తీర్మానించాయి. వర్షాలు దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం చెల్లించాలని కోరారు. బిచ్కుంద, పిట్లం, పెద్దకొడప్‌గల్ మండలంలోని పలు సొసైటీల్లో సోమవారం మహాజన సభలు నిర్వహించారు. ఈసందర్భంగా సొసైటీ సభ్యులు, రైతులు పలు అంశాలపై చర్చించి, తీర్మానాలు చేశారు. ముఖ్యంగా రైతులకు సబ్సిడీ విత్తనాలు పంపిణీ చేయాలని, యాసంగి వరి ధాన్యంపై బోనస్ ఇవ్వాలని, ఖరీఫ్ వరి ధాన్యానికి బోనస్ ఇవ్వాలని తదితర తీర్మానాలు చేశారు. సొసైటీ చైర్మన్లు నాల్చర్ బాలాజీ, ఒంటరి శబ్దంరెడ్డి, సాయిరెడ్డి, హన్మంత్‌రెడ్డి, వైస్ చైర్మన్ యాదవరావు, డైరెక్టర్లు, సీఈవో శ్రావణ్ కుమార్, బంతిలాల్, దస్తారుడ్డి, హనుమయ్య తదితరులు పాల్గొన్నారు.