
నిలకడగా గోదారి.. నీటిలోనే పంటలు
రెంజల్(బోధన్): ఉగ్ర గోదావరి నిలకడగా మారింది. ఎగువన మహారాష్ట్ర నుంచి భారీ వరద వస్తుండగా, స్థానికంగా మంజీర నది నుంచి వరద ఉధృతి తగ్గుతోంది. దీంతో గోదావరి నది పరీవాహక గ్రామాల్లో వేసిన పంటలు నీటిలోనే ఉన్నాయి. మూడు రోజులుగా వరద నీరు వదలక పోవడంతో పంటలు పూర్తిగా దెబ్బతింటాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని తాడ్‌బిలోలి–బోర్గాం గ్రామాల మధ్య నిర్మించిన జాతీయ రహదారికి ఇరువైపులా పంట పొలాలు 15 ఫీట్ల లోతులో మునిగి ఉన్నాయి.
నిలిచిన రాకపోకలు
తాడ్‌బిలోలి–బోర్గాం గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి బ్యాక్‌వాటర్‌తో రెండు గ్రామాల మధ్య ఉన్న వంతెనకు ఇరువైపులా రోడ్డుపై వరద నీరు నిలిచిపోయింది. నిజామాబాద్ నుంచి వచ్చే ఆర్టీసీ బస్సులను సాటాపూర్ నుంచి జాతీయ రహదారి మీదుగా గ్రామానికి నడుపుతున్నారు.

నిలకడగా గోదారి.. నీటిలోనే పంటలు