
ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి
బీబీపేట: స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రతి అధికారి సిద్ధంగా ఉండాలని ఎంపీడీవో పూర్ణచంద్రోదయకుమార్ అన్నారు. మండల కేంద్రంలో సోమవారం ఆయన మండల కార్యదర్శులు, గ్రామ పంచాయతీ అధికారులతో సమావేశం నిర్వహించి, మాట్లాడారు. ఎన్నికల కోడ్ ఉన్నందున గ్రామాల్లోని ప్రభుత్వ కార్యాలయాల్లో ఎలాంటి రాజకీయ నాయకుల ఫోటోలు, పేర్లు ఉండకూడదని, వాల్ పెయింటింగ్‌లు ఉన్నచోట పెయింట్ వేయాలని సూచించారు. అలాగే నాయకుల విగ్రహాల నాయకులకు ముసుగులు వేయాలని తెలిపారు. ప్రతిరోజు అందుబాటులో ఉండాలని అధికారులకు సూచించారు. తహసీల్దార్ గంగసాగర్, ఆర్‌ఐ రాముల తదితరులు పాల్గొన్నారు.
ఫ్లెక్సీల తొలగింపు
ఎల్లారెడ్డిరూరల్/ నాగిరెడ్డిపేట: స్థానిక సంస్థలకు సంబంధించి ఎ న్నికల కోడ్ అమలులోకి రావడంతో పంచాయతీ కార్యదర్శులు గ్రామాల లో రాజకీయ నాయకుల కు సంబందించిన ఫ్లెక్సీలను సోమవారం తొలగించారు. ఎలక్షన్ కోడ్ అమలులోకి రావడంతో ఎల్లా రెడ్డి, నాగిరెడ్డిపేటలోని ప్రభుత్వ భవనాలు, స్థలాల లో రాజకీయ నాయకులకు సంబంధించిన పోస్ట ర్లు, ఫ్లెక్సీలను అధికారులు తొలగించి వేశారు.
● జిల్లా జైలు సూపరింటెండెంట్
చింతల దశరథం
ఖలీల్‌వాడి: తనపై వచ్చిన ఆరోపణలు అవాస్తవమని, ఎవరో అనవసరంగా దుష్ప్రచారం చేస్తున్నారని జిల్లా జైలు సూపరింటెండెంట్ చింతల దశరథం ‘సాక్షి’కి ఫోన్ ద్వారా సోమవారం తెలిపారు. విధుల్లో భాగంగా వివిధ అంశాలపై అందరి సమక్షంలో మాట్లాడుతామని, తనపై అనవసరంగా సోషల్ మీడియాలో ప్రచారం చేయడం సబబుకాదన్నారు. తనపై ఎలాంటి జుడీషియల్ విచారణ జరగడం లేదన్నారు. తప్పుడు ప్రచారం మానుకోవాలన్నారు. మరోవైపు, ఇదే అంశంపై కామారెడ్డి జైలులోని జూనియర్ అసిస్టెంట్ ముందుకొచ్చి నిజామాబాద్ జైలు సూపరింటెండెంట్‌పై వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవమని వివరణ ఇచ్చారు. ఆరోపణలకు తనకు ఎలాంటి సంబంధం లేదని ఆయన ఉన్నతాధికారికి ఉత్తరం అందించారు.

ఎన్నికలకు సిద్ధంగా ఉండాలి