
ముంపుప్రాంతాల పరిశీలన
నాగిరెడ్డిపేట(ఎల్లారెడ్డి): మండలంలోని వెంకంపల్లి, తాండూర్, బంజరప్రాంతంలో వరదనీటితో ముంపునకు గురైనప్రాంతాలను ఆదివారం ఎల్లా రెడ్డి ఆర్డీవో పార్థసింహారెడ్డి పరిశీలించారు. ఈసందర్భంగా వెంకంపల్లి, తాండూర్ శివారులో వరదనీటితో మునిగిన పంటలను రైతులతో కలిసి సందర్శించారు. వెంకంపల్లి సమీపంలోని బ్రిడ్జి వద్ద ఉధృతంగా ప్రవహిస్తున్న మంజీరనదిని, బంజర సమీపంలో జాతీయ రహదారికి ఇరువైపులా వ చ్చిన వరదనీటిని పరిశీలించారు. వరదనీరు రహ దారి పైకి చేరకుండా అడ్డుగా మట్టికట్టలు వేయా లని హైవే సిబ్బందికి ఆయన సూచించారు. వరద మరింత పెరిగే అవకాశం ఉందని, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన తెలిపారు.