
ఏకధాటి వర్షాలు.. నీటమునుగుతున్న పంటలు
పొలంలో ఇసుకమేటలు ఏర్పడ్డాయి..
● ఆందోళనలో అన్నదాతలు
● ప్రభుత్వం ఆదుకోవాలని వేడుకోలు
బతుకమ్మతో మహిళ, చిన్నారులు
రాజంపేట: నెల రోజుల క్రితం కురిసిన భారీ వర్షా లు రైతులకు భారీ నష్టాన్ని మిగిల్చగా, ప్రస్తుతం కురుస్తున్న వర్షాలతో చేతికొచ్చిన పంటలు నీటమునుగుతున్నాయి. దీంతో అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రూ.వేల పెట్టుబడి పెట్టి పంటలు సాగు చేస్తుంటే నిత్యం కురుస్తున్న వర్షాల వల్ల పొలాలు నీటమునుగుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలంలోని పలుచోట్ల మొక్కజొన్న పంటలు నీరు పట్టి దెబ్బతినగా, వరి పంటలు సైతం చేతికి అందేలా లేదని రైతులు పేర్కొంటున్నారు. ప్రభుత్వం ఆశించిన స్థాయిలో నష్టపరిహారం అందిస్తే తప్ప కోలుకునే పరిస్థితిలేదని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
క్రైం కార్నర్
నాలుగున్నర ఎకరాలలో వరిపంట సాగు చేస్తున్నాను. గతంలో కురిసిన వర్షాలకు వరి పంట చాలా వరకు దెబ్బతిన్నది. పొలం పక్కన కాలువ ఉండటంతో వరద నీరు ఉధృతంగా వస్తుండటంతో పంట మునిగిపోతుంది. పొలంలో ఇసుకమేటలు ఏర్పడ్డాయి. ఏమి చేయాలో తోచడం లేదు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలి.
–రాజిరెడ్డి,
రైతు, శివాయిపల్లి

ఏకధాటి వర్షాలు.. నీటమునుగుతున్న పంటలు

ఏకధాటి వర్షాలు.. నీటమునుగుతున్న పంటలు

ఏకధాటి వర్షాలు.. నీటమునుగుతున్న పంటలు

ఏకధాటి వర్షాలు.. నీటమునుగుతున్న పంటలు

ఏకధాటి వర్షాలు.. నీటమునుగుతున్న పంటలు

ఏకధాటి వర్షాలు.. నీటమునుగుతున్న పంటలు

ఏకధాటి వర్షాలు.. నీటమునుగుతున్న పంటలు

ఏకధాటి వర్షాలు.. నీటమునుగుతున్న పంటలు

ఏకధాటి వర్షాలు.. నీటమునుగుతున్న పంటలు