
దేశీదారు పట్టివేత
బిచ్కుంద(జుక్కల్): మండల కేంద్రంలో మహారాష్ట్రకు చెందిన దేశీదారు పట్టుకున్నామని ఎకై ్సజ్ సీ సత్యనారాయణ ఆదివా రం తెలిపారు. పిట్లం మండలం బండపల్లి గ్రామానికి చెందిన మేదరి గంగారాం మహా రాష్ట్ర నుంచి బైక్‌పై దేశీదారు తీసుకొస్తున్నార ని సమాచారం మేరకు బిచ్కుంద బస్టాండ్ వద్ద కాపుకాచి పట్టుకొని 8 దేశీదారు బాటిళ్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. గంగారాంను పట్టుకొని కేసు నమోదు చేశామన్నారు.
● ఒకరి మృతి
ఎల్లారెడ్డిరూరల్: ఎల్లారెడ్డి మండలంలోని అన్నాసాగర్ గేట్ వద్ద ఎక్సెల్ వాహనాన్ని ఆర్టీసీ బస్సు ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి చెందినట్లు స్థానికులు ఆదివారం తెలిపారు. మహ్మద్‌నగర్ మండలంలోని నర్వ గ్రామానికి చెందిన గూల చిన్న అంజయ్య (47) నిజాంసాగర్ నుంచి నర్వకు వెళ్తుండగా, బాన్సువాడ నుంచి ఎల్లారెడ్డికి వస్తున్న ఆర్టీసీ బస్సు ఎక్సెల్ వాహనాన్ని ఢీకొట్టింది. దీంతో ఘటనా స్థలంలోనే అంజయ్య మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.