
జిల్లా కేంద్రంలో ‘పూల’ సందడి
కామారెడ్డి టౌన్: జిల్లాలో సద్దుల బతుకమ్మ పండుగను సోమవారం జరుపుకోనున్నారు. ఈక్రమంలో ఆదివారం జిల్లాకేంద్రంలోని మా ర్కెట్‌లో పూల కొనుగోళ్లతో సందడి నెలకొంది. జిల్లా కేంద్రంలోని సుభాష్‌రోడ్, జేపీఎన్ రోడ్ అంతటా గునక, తంగెడు, తదితర పూల కేంద్రాలు వెలియగా విక్రయాలు జోరుగా సాగా యి. వ్యాపారులు పండుగ నేపథ్యంలో పూల ను అధిక ధరలకు విక్రయించడంతో ప్రజలు అసహనం వ్యక్తం చేశారు.
ఎల్లారెడ్డిలో నేడు సద్దుల బతుకమ్మ..
ఎల్లారెడ్డి: ఎల్లారెడ్డిలో నేడు సద్దుల బతుకమ్మ పండుగను నిర్వహించనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు. పట్టణంలోని పెద్ద చెరువుకట్ట, ప్ర భుత్వ జూనియర్ కళాశాల, కొచ్చెరువు, ఆజాద్‌గ్రౌండ్, రాజుల కుంట వద్ద బతుకమ్మ ఆటలను ఆడి బతుకమ్మలను చెరువులో నిమజ్జనం చేయాలని వారు కోరారు. పండుగకు సంబంధించి ప్రజల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మున్సిపల్ కమిషనర్ మహేష్‌కుమా ర్ ఒక ప్రకటనలో తెలిపారు.
గాంధారిలో..
గాంధారి(ఎల్లారెడ్డి): మండల కేంద్రంలో నేడు నిర్వహించే సద్దుల బతుకమ్మ వేడుకలను ప్రజ లు రోడ్డుపైనే జరుపుకోవాలని గ్రామ కార్యదర్శి కోరారు. వర్షాల కారణంగా వాగు వద్ద వేడుకలు నిర్వహించేందుకు అనుకూలంగా లే దన్నారు. రోడ్డుపైనే ఒక పక్కన వేడులకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు.