
మంచి జీవన శైలి అలవర్చుకోవాలి
శారీరక శ్రమ లేకపోవడం, అధిక కొలెస్ట్రాల్ ఉన్న ఆహారం తీసుకోవడం, మత్తు పదార్థాలు, ధూమపానం వంటి వాటితో అనేక రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. అందుకే అలవాట్లను మార్చుకోవాలి. ప్రతి ఒక్కరూ రోజూ వ్యాయామం చేయాలి. నడకతో గుండె మీద భారాన్ని తగ్గించుకోవచ్చు. బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఎక్కువ ఉన్నవారు వాటిని అదుపులో ఉంచుకునేందుకు వైద్యుల సలహాలు పాటిస్తే గుండె జబ్బుల బారిన పడకుండా ఉండొచ్చు.
– శరత్, అసోసియేట్ ప్రొఫెసర్, ప్రభుత్వ వైద్యకళాశాల, కామారెడ్డి