
ఇదేమి ఆధునికీకరణ!
పాతకు
పూత..
సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : కామారెడ్డి పట్టణంలోని రైల్వే స్టేషన్ మీదుగా సికింద్రాబాద్, కాచిగూడ స్టేష న్ల నుంచి నాందేడ్, మన్మాడ్, ముంబయి, నాగర్‌సో ల్, అకోలా వంటి నగరాలకు వెళ్లే రైళ్లన్నీ ఆగుతా యి. అలాగే నిజామాబాద్, కామారెడ్డి మీదుగా హై దరాబాద్, తిరుపతి, నర్సాపూర్, అనంతపూర్, కడ ప, విజయవాడ, విశాఖపట్టణం, ఒడిషాలోని సంబల్పూర్ వంటి ప్రాంతాలకు వెళ్లే రైళ్ల స్టాప్‌లు ఇక్కడ ఉన్నాయి. కామారెడ్డి జిల్లాతోపాటు సిరిసిల్ల, సిద్దిపే ట, మెదక్ జిల్లాలకు చెందిన ప్రయాణికులు వివిధ ప్రాంతాలకు కామారెడ్డి రైల్వే స్టేషన్ ద్వారా వెళ్తుంటారు. ముఖ్యంగా ముంబయికి రోజూ దేవగిరి ఎ క్స్‌ప్రెస్‌లో వందలాది మంది ఇక్కడి నుంచే వెళతా రు. రైల్వే డబ్లింగ్ పనులు పూర్తయితే రైళ్ల సంఖ్య మ రింత పెరిగే అవకాశాలున్నాయి. ఇంతటి ప్రాధాన్య త ఉన్న రైల్వే స్టేషన్‌ను ఆధునికీకరించి అధునాతన సౌకర్యాలు కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం అమృత్ భారత్ స్టేషన్ స్కీం(ఏబీఎస్‌ఎస్)ను అమలు చేసింది. ఇందులో భాగంగా స్టేషన్ అభివృద్ధి కోసం రూ.39.90 కోట్లు మంజూరు చేసింది. 2023 ఆగస్టు 6న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వర్చువల్‌గా ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.
ఏబీఎస్‌ఎస్ పనులను రెండేళ్లలో పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఇందులో భాగంగా స్టేషన్‌లో పలు అభివృద్ధి పనులు మొదలుపెట్టారు. ప్రస్తుతం ఉన్న భవనంలో మార్పులు చేసి వెయిటింగ్ హాల్‌ను విస్తరిస్తున్నారు. టాయిటెట్స్, ఎస్కలేటర్లు, లిఫ్ట్‌లకు సంబంధించిన పనులు కొనసాగుతున్నాయి.అలాగే స్టేషన్ ముందు భాగాన ఆధునికత ఉట్టిపడేలా తీర్చిదిద్దనున్నారు. రైల్వే స్టేషన్‌కు కావలసినంత స్థలం అందుబాటులో ఉంది. రైల్వేస్టేషన్ ఆధునికీకరణతో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందుతాయని భావిస్తున్నారు. అయితే పనులు నత్తనడకన సాగుతుండడంతో గడువు ముగిసినా పూర్తికాలేదు. అన్ని పనులు పూర్తి కావాలంటే మరో ఏడాది పట్టే అవకాశం కనిపిస్తోంది.
పాత భవనానికే సొబగులు..
జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్ భవనాన్ని 1896 లో నిర్మించారు. అప్పటి నిజాం పాలకులు హైదరాబాద్ నుంచి కామారెడ్డి, నిజామాబాద్ మీదుగా మన్మాడ్‌కు రైల్వే లైన్ వేయించారు. అప్పుడే కామారెడ్డి, నిజామాబాద్ రైల్వే స్టేషన్లు నిర్మించినట్లు రికార్డులు చెబుతున్నాయి. రైల్వే స్టేషన్‌కు పలుమార్లు మరమ్మతులు చేశారు. స్టేషన్ భవనం పైకప్పు దెబ్బతింది. ఇపుడు దానికే మరమ్మతులు చేస్తున్నారు. దాదాపు 130 ఏళ్ల నాడు నిర్మించిన భవనానికే మెరుగులు దిద్దుతుండడం విస్మయం కలిగిస్తోంది. రైల్వే స్టేషన్‌లో ఆధునిక సౌకర్యాలు ఎన్నో కల్పిస్తున్న ప్రభుత్వం.. శిథిలావస్థకు చేరిన స్టేషన్ భవనానికి మెరుగులు దిద్దడం బాగోలేదని పలువురు పేర్కొంటున్నారు. కొత్త భవనం నిర్మించకుండా పాత భవనానికి మరమ్మతులు చేస్తుండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. దీర్ఘకాలం మన్నేలా నూతన భవనం నిర్మించాలని కోరుతున్నారు.
కామారెడ్డి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పనులను రెండేళ్లలో పూర్తి చేయాల్సి ఉన్నా.. ఇప్పటికీ అసంపూర్తిగానే ఉన్నాయి. మరోవైపు శతాబ్దం క్రితం నిర్మించిన పాత భవనానికే మరమ్మతులు చేస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
కామారెడ్డి రైల్వే స్టేషన్
భవనానికి 130 ఏళ్లు
‘అమృత్ భారత్’లో అభివృద్ధికి
రూ.39.90 కోట్లు మంజూరు
కొత్త భవనం నిర్మించకుండా
పాతదానికే మరమ్మతులు
విస్మయం వ్యక్తం చేస్తున్న ప్రజలు

ఇదేమి ఆధునికీకరణ!

ఇదేమి ఆధునికీకరణ!

ఇదేమి ఆధునికీకరణ!