
ఫార్మసిస్టుల సేవలు అమూల్యమైనవి
పిట్లం(జుక్కల్): స్థానిక ప్రభుత్వ ఆస్పత్రి వద్ద శుక్రవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యలో ఫార్మసిస్టులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ రీజియన్ కో–ఆర్డినేటర్ వేణుగోపాల్ మాట్లాడుతూ.. ప్రపంచ ఫార్మసిస్ట్ దినోత్సవాన్ని పురస్కరించుకుని మండలంలోని ఫార్మసిస్టులు గజవాడ శ్రీనివాస్, నవిత, ఆయుష్ ఫార్మసిస్ట్‌లు కవిత, కల్పనలను సన్మానించినట్లు తెలిపారు. వైద్య రంగంలో ఫార్మసిస్టుల సేవలు ఎంతో విలువైనవి, అమూల్యమైనవని పేర్కొన్నారు. క్లబ్ అధ్యక్షుడు నారాయణ, కార్యదర్శి బాలు, రీజియన్ ఈఈ కిషన్, రాజు తదితరులు పాల్గొన్నారు.