
టేకు చెట్ల నరికివేత
● ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు
దోమకొండ: మండలం కేంద్రానికి చెందిన రైతు పున్న లక్ష్మణ్ వ్యవసాయ బావి వద్ద గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు టేకు చెట్లను నరికివేశారు. ఐదు చెట్లను నరికి వాటిని ఎత్తుకెళ్లారని ఈ సందర్భంగా రైతు లక్ష్మణ్ తెలిపారు. ఈ విషయంపై ఫారెస్ట్ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు వివరించారు. శుక్రవారం తెల్లవారుజామున వ్యవసాయ బావి వద్దకు వెళ్లగా టేకు చేట్లు నరికివేసి దొంగిలించినట్లు తెలిసిందన్నారు. శనివారం ఘటనా స్థలానికి వస్తామని ఫారెస్ట్ అధికారులు తెలిపినట్లు ఆయన వివరించారు.