
రైతు కుటుంబం నుంచి డీఎస్పీ
బిచ్కుంద(జుక్కల్): కందర్‌పల్లి గ్రామం నుంచి ఓ రైతు బిడ్డ గ్రూప్–1లో ప్రతిభ చాటి డీఎస్పీ ఉద్యోగం సాధించాడు. కోజిగెవార్ వెంకటదీప్ గ్రూప్–1 పరీక్షరాసి 141 ర్యాంకు సాధించి డీఎస్పీగా ఉద్యోగం సాధించాడు. తండ్రి నాగ్‌నాథ్ రైతు. వెంకటదీప్ మొదటగా ఫారెస్టు బీట్ ఆఫీసర్ ఉద్యోగం సాధించారు. విధుల్లో చేరిన అనంతరం యూపీఎస్సీ గ్రూప్ రాసి 4 నెలల క్రితం సెంట్రల్ అకౌంటెంట్ ఆఫీసర్‌గా ఉద్యోగం సాధించి హైదరాబాద్‌లో ఉద్యోగం చేస్తున్నారు. రెండు ఏద్యోగాలు సాధించినప్పటికి సంతృప్తి చెందలేదు. ఉన్నత ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో గ్రూప్–1 పరీక్ష రాసి డీఎస్పీగా ఉద్యోగం సాధించాడు. తమ తల్లిదండ్రుల సహకారం, ప్రోత్సాహంతో డీఎస్పీ ఉద్యోగం సాధించానని వెంకటదీప్ అన్నారు.