
కుక్కల బెడదను అరికట్టండి
బాన్సువాడ: బీర్కూర్ మండల కేంద్రంలో కుక్కలు రోజురోజుకు పెరుగుతున్నాయి. శునకాలు రోడ్లుపై తిరుగుతూ వాహనదారుల వెంట పడి దాడులు చేస్తున్నాయి. రెండు రోజుల క్రితం బరంగెడ్గిలో ముగ్గురు వ్యక్తులపై కుక్కలు దాడి చేసి గాయపరిచిన ఘటన మరువక ముందే మండల కేంద్రంలో శునకాలు గుంపులు గుంపులుగా సంచరించడంతో ప్రజలు భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ అధికారులు స్పందించి కుక్కలను తరలించేలా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
దోమకొండ: మండలంలోని ముత్యంపేటలో ప్రధాన రహదారి గుంతలమయంగా మారింది. గ్రామంలోని పంజాబ్ నేష్‌నల్ బ్యాంకు ముందు రోడ్డు పరిస్థితి దారుణంగా తయారైంది. దోమకొండ మండల కేంద్రం నుంచి కామారెడ్డికి ముత్యంపేట మీదుగా వెళ్లే ప్రధాన రహదారి అధ్వానంగా మారింది. దీంతో గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గ్రామంలో పంచాయతీ పాలకవర్గం లేకపోవడం, అధికారులకు చెప్పినా వారు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మురికి నీరు కూడా రోడ్లపైకి వచ్చి దుర్గంధం వ్యాపిస్తోందని వారు పేర్కొంటున్నారు.

కుక్కల బెడదను అరికట్టండి