
‘157 సెల్‌ఫోన్‌ల రికవరీ’
కామారెడ్డి టౌన్: జిల్లాలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో పోగొట్టుకున్న రూ. 25 లక్షల విలువ గల 157 సెల్‌ఫోన్‌లను స్పెషల్ డ్రైవ్ ద్వారా రికవరీ చే శామని ఎస్పీ రాజేశ్ చంద్ర తెలిపారు. శుక్రవారం ఆయన ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన స మావేశంలో వివరాలను వెల్లడించారు. పోగొట్టుకున్న, చోరీకి గురయిన ఫోన్ల రికవరీ కోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశామన్నారు. సీఈఐఆర్ పో ర్టల్ ద్వారా జిల్లాలో ఈ వారంలో 968 ఫోన్లు, పోర్ట ల్ ప్రారంభం నుంచి ఇప్పటివరకు 3,862 ఫోన్లు రికవరీ చేశామన్నారు. బాధితులు ఆర్‌ఎస్సై బాల్‌రాజు 87126 86114ను సంప్రదించి పోగొ ట్టుకున్న ఫోన్‌లను తీసుకెళ్లాలని తెలిపారు. ఫోన్లు పోగొట్టుకున్నవారు వెంటనే సిమ్ బ్లాక్ చేసి కొత్త సిమ్ తీసుకుని పోలీసులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. ఫోన్‌ల రికవరీలో ప్రతిభ చూపిన టీం సభ్యులను ఎస్పీ అభినందించారు. సమావేశంలో ఏఎస్పీ చైతన్యరెడ్డి తదితరులు పాల్గొన్నారు.