రూ. 5,55,555తో అమ్మవారికి అలంకరణ | - | Sakshi
Sakshi News home page

రూ. 5,55,555తో అమ్మవారికి అలంకరణ

Sep 27 2025 4:57 AM | Updated on Sep 27 2025 4:57 AM

రూ. 5

రూ. 5,55,555తో అమ్మవారికి అలంకరణ

కామారెడ్డి టౌన్‌ : జిల్లాలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు కొనసాగుతున్నాయి. శుక్రవారం అమ్మవారు శ్రీ మహాలక్ష్మి అవతారంలో భక్తు లను అనుగ్రహించారు. జిల్లా కేంద్రంలోని దేవివిహార్‌ కాలనీలోని దేవి రెసిడెన్సీ బ్లాక్‌ లో ప్రతిష్ఠించిన అమ్మవారిని రూ.5,55,555 ల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు. భక్తులు అమ్మవారికి ఒడిబియ్యం, చీరలు, పసుపు, కుంకుమ సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు.

‘విపత్తులను ఎదుర్కోవడానికి

సిద్ధంగా ఉన్నాం’

కామారెడ్డి అర్బన్‌: విపత్కర పరిస్థితులను ఎ దుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని విద్యుత్‌ శాఖ ఎస్‌ఈ శ్రావణ్‌కుమార్‌ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా పేర్కొన్నారు. జిల్లాలో అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయ న్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో అప్రమత్తంగా ఉన్నామని తెలిపారు. వినియోగదారుల నుంచి వస్తున్న ఫిర్యాదులను పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. మొబైల్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ వాహనాలను ఏర్పాటు చేశా మని తెలిపారు. ట్రాన్స్‌ఫార్మర్లు, మీటర్ల వద్ద వినియోగదారులు ప్యూజ్‌లు మార్చడం, రి పేర్లు చేయడం ప్రమాదకరమని, ఏదైనా సమస్య ఉంటే 1912 నంబర్‌కు ఫోన్‌చేసి చె ప్పాలని సూచించారు.

ఆర్ట్స్‌ కళాశాల విద్యార్థులకు

జాతీయ స్థాయి పురస్కారాలు

కామారెడ్డి అర్బన్‌ : కామారెడ్డి ఆర్ట్స్‌ అండ్‌ సై న్స్‌ కళాశాల విద్యార్థులు నలుగురికి జాతీ య స్థాయి పురస్కారాలు లభించాయని క ళాశాల ప్రిన్సిపల్‌ విజయ్‌కుమార్‌ తెలిపారు. సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొన్నందుకు నేషనల్‌ ఇంటిగ్రేటెడ్‌ ఫోరం ఆఫ్‌ ఆర్టి స్ట్స్‌ అండ్‌ యాక్టివిస్ట్స్‌(నిఫా) సంస్థ జాతీయ స్థాయి యంగ్‌ కమ్యూనిటీ చాంపియన్‌ సేవా రత్న పురస్కారాలు అందించిందన్నారు. శు క్రవారం న్యూఢిల్లీలోని భారత మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులు షే క్‌ రిజ్వన్‌ అహ్మద్‌, ఉదగిరి రాజ్‌కు మార్‌, బే స మానస, రాందిన్‌ కుల్దీప్‌నాయర్‌ ఈ పురస్కారాలు అందుకున్నారన్నారు. చదువుతో పాటు సామాజిక సేవా కార్యక్రమాలు, ఎన్‌ఎస్‌ఎస్‌, ఎన్‌సీసీ, రక్తదాన శిబిరాల్లో పాల్గొన్నందుకు అవార్డులు దక్కాయన్నారు.

తొలి రోజు ఒకటి..

సాక్షి ప్రతినిధి, కామారెడ్డి : మద్యం దుకాణా ల నిర్వహణకు సంబంధించిన గెజిట్‌ నోటి ఫికేషన్‌ను ప్రభుత్వం శుక్రవారం విడుదల చేసి దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. తొలి రోజు ఒక దరఖాస్తు వచ్చింది. బాన్సువాడ నుంచి ఒక దరఖాస్తు వచ్చిందని జిల్లా ఎకై ్సజ్‌ సూపరింటెండెంట్‌ హన్మంతరావు తెలిపారు. జిల్లాలో 49 మద్యం దు కాణాలు ఉన్నాయి. ఇందులో కామారెడ్డి స ర్కిల్‌ పరిధిలో 15 దుకాణాలు, దోమకొండ పరిధిలో ఎనిమిది, ఎల్లారెడ్డిలో ఏడు, బా న్సువాడలో తొమ్మిది, బిచ్కుందలో పది మ ద్యం దుకాణాలున్నాయి. జిల్లాలో మద్యం దుకాణాలను దక్కించుకునేందుకు ప్రస్తుతం మద్యం వ్యాపారంలో ఉన్న వారితో పాటు కొత్త వారు చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. దసరా పండగ తర్వాత దరఖాస్తులు స్పీడందుకోనున్నాయి.

బోధన్‌–బీదర్‌ రైల్వే పనుల

కోసం భూ పరీక్షలు

రుద్రూర్‌ : బోధన్‌ నుంచి కర్ణాటకలోని బీదర్‌ వరకు కొత్త రైల్వే లైన్‌ పనుల కోసం అధికారులు భూ పరీక్షలు నిర్వహిస్తున్నారు. రుద్రూర్‌ మండలంలోని అంబం(ఆర్‌) శివారులో రెండురోజులుగా భూ పరీక్షలు కొనసాగుతున్నాయి. పరీక్షల అనంతరం నివేదికను కేంద్ర రైల్వే అధికారులకు సమర్పించనున్నారు. గతంలో బోధన్‌ నుంచి బీదర్‌ వరకు కొత్త రైల్వేలైన్‌ కోసం భూసేకరణ చేసి హద్దులను గుర్తించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం భూ పరీక్షలు చేస్తుండడంతో రైల్వేలైన్‌ పనుల ప్రారంభంపై ఈ ప్రాంత ప్రజల్లో ఆశలు చిగురించాయి.

రూ. 5,55,555తో  అమ్మవారికి అలంకరణ 
1
1/2

రూ. 5,55,555తో అమ్మవారికి అలంకరణ

రూ. 5,55,555తో  అమ్మవారికి అలంకరణ 
2
2/2

రూ. 5,55,555తో అమ్మవారికి అలంకరణ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement