
క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి
దోమకొండ : పోలీసులు క్రమశిక్షణతో విధులు నిర్వహించాలని ఏఎస్పీ చైతన్యరెడ్డి సూచించారు. శుక్రవారం ఆమె దోమకొండ పోలీస్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. స్టేషన్ పరిసరాల పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, కేస్ డైరీస్, ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్, స్టేషన్ హాజరు రిజిస్టర్, మల్టీ బుక్స్, సీసీ కెమెరాల రికార్డులు, ఆయుధాల భద్రత, లాకప్ గదులను పరిశీలించారు. అనంతరం డ్యూటీలో ఉన్న సిబ్బందితో మాట్లాడారు. గ్రామాల్లో రాత్రి వేళల్లో గస్తీ నిర్వహించాలని సూచించారు. పెండింగ్ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. స్టేషన్ పరిధిలో నేరాల నియంత్రణకు కృషి చేయాలని సిబ్బందికి సూచించారు. ఆమె వెంట భిక్కనూరు సీఐ సంపత్ కుమార్, ఎస్సై స్రవంతి, సిబ్బంది ఉన్నారు.