
ఒక బోరు.. 29 కనెక్షన్లు
మండల కేంద్రంలోని న్యూ బీసీ కాలనీలో 47 కుటుంబాలు నివసిస్తున్నాయి. మిషన్ భగీరథ పైప్‌లైన్ వేసి ఇంటింటికి నల్లా కనెక్షన్లు ఇచ్చినా.. నీటిని మాత్రం సరఫరా చేయడం లేదు. కాగా ఈ కాలనీ మొత్తంలో ఒకే పబ్లిక్ బోరు బావి ఉంది. కొన్ని కుటుంబాలకు మాత్రమే సొంత బోర్లున్నాయి. మిగిలిన కుటుంబాలన్నింటికీ ఈ బోరు నీరే ఆధారం. దీంతో బోరునుంచి ఇళ్లకు వేరువేరుగా పైప్‌లైన్లు ఏర్పాటు చేసుకుని వాడుకుంటున్నారు. అయితే ఈ బోరులోంచి నీరు తక్కువ వస్తుండడంతో నీటి కోసం యుద్ధాలు చేయాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయని కాలనీవాసులు పేర్కొంటున్నారు. అధికారులు స్పందించి మిషన్ భగీరథ పథకం నీరు సరఫరా అయ్యేలా చూడాలని కోరుతున్నారు. – రాజంపేట
బోరు మోటారుకు ఏర్పాటు చేసిన పైప్‌లైన్ కనెక్షన్లు