చికిత్స పొందుతూ ఒకరి మృతి
పెద్దకొడప్‌గల్: బైక్‌పై నుంచి పడి తీవ్రగాయాలతో చికిత్స పొందుతూ ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన పెద్దకొడప్‌గల్ మండల కేంద్రంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. మండల కేంద్రానికి చెందిన ఆర్‌ఎంపీ పండరి ఈ నెల 10న అంజని గ్రామంలో నిర్వహిస్తున్న అఖండ హరినామ సప్తాహం కార్యక్రమంలో పాల్గొనేందుకు బైక్‌పై వెళ్తున్నాడు. రోడ్డుపై ధాన్యం కుప్పలు ఉండడాన్ని గమనించని అతను వాటిపై ప్రయాణించడంతో కిందపడిపోయాడు. తలకు తీవ్రమైన గాయాలు కావడంతో మెరుగైన చికిత్స నిమిత్తం నిజామాబాద్‌కు తరలించగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. సాయంత్రం అంత్యక్రియలు నిర్వహించారు.
తాడ్కోల్‌లో మరో వ్యక్తి..
బాన్సువాడ రూరల్: ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్యకు పాల్పడిన ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు సీఐ అశోక్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బాన్సువాడ మండలం తాడ్కోల్‌కు చెందిన కుర్మసాయిలు (51) గ్రామంలో పనులు చేస్తూ జీవిస్తున్నాడు. కొంత కాలంగా మద్యానికి బానిసయ్యాడు. ఈ నెల 9న కుమార్తె వివాహం విషయంలో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. దీంతో ఆర్థిక ఇబ్బందులతో సాయిలు ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబీకులు నిజామాబాద్‌కు తరలించిగా చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మృతి చెందాడు. మృతుడి భార్య గంగామణి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్త్నుట్లు సీఐ పేర్కొన్నారు.


