కల్వర్టు గుంతలో పడి ఇద్దరికి గాయాలు
ఎల్లారెడ్డి: మండలంలోని తిమ్మారెడ్డి గ్రామ శివారులో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా.. అన్నాసాగర్ గ్రామానికి చెందిన బాలరాజు, తన కూతురు భావనతో కలిసి ఆదివారం బైక్‌పై ఎల్లారెడ్డికి బయలుదేరారు. తిమ్మారెడ్డి గ్రామ శివారులో ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి ప్రమాదవశాత్తు కల్వర్టు గుంతలో వారు పడిపోయారు. ఈ ఘటనలో తండ్రి, కూతురికి గాయాలు కావడంతో స్థానికులు ఎల్లారెడ్డి ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాలరాజుకు తీవ్రగాయాలు కావడంతో కామారెడ్డికి రిఫర్ చేసినట్లు వైద్యులు తెలిపారు. రోడ్డు పనులు జరుగుతున్న సమయంలో ఎలాంటి ప్రమాద సూచికలు ఏర్పా టు చేయకపోవడంతో ప్రమాదాలు జరుగుతున్నా యని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కల్వర్టు గుంతలో పడి ఇద్దరికి గాయాలు


