పారిశుధ్యం లోపించకుండా చూడాలి
బిచ్కుంద: మండల కేంద్రం, గ్రామాల్లో ఎక్కడ పారిశుధ్యం లోపించకుండా కార్యదర్శులు జాగ్రత్తలు తీసుకోవాలని డీపీవో మురళి అన్నారు. గురువారం శ్రీసాక్షిశ్రీలో మురికికూపంగా బస్టాండ్ శీర్షికన ప్రచురితమైన కథనానికి డీపీవో మురళి, ప్రత్యేక అధికారి, తహసీల్దార్ వేణుగోపాల్ స్పందించారు. డీపీవో మురళి ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించారు. బస్టాండ్‌లో మురికిని వెంటనే తొలగించాలని కార్యదర్శి శ్రీనివాస్‌గౌడ్‌ను డీపీవో ఆదేశించారు. సీసీరోడ్డు కంటే మురికి కాలువ ఎత్తులో ఉండటంతో మురికి నీరు బయటకు వెళ్లడం లేదన్నారు. కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో నిర్మించిన మురికి కాలువ ఉపయోగం లేకుండా పోయిందన్నారు. మొరం వేసి సీసీ రోడ్డు ఎత్తు పెంచాలని సూచించారు.
పరిసరాలు పరిశుభ్రంగా ఉంచాలి
పెద్దకొడప్‌గల్(జుక్కల్): మండంలోని చిన్న దేవిసింగ్ తండాలో రోడ్డుపై పారుతున్న మురుగునీరు శీర్షికన గురువారం ప్రచురితమైన కథనానికి మండల అధికారులు స్పందించారు. ఎంపీడీవో లక్ష్మికాంత్ రెడ్డి చిన్న దేవిసాంగ్ తండాను సందర్శించి మురుగునీరును తొలగింపజేశారు. దుర్గంధం రాకుండా మొరం పోయించారు. గ్రామల్లో పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని కార్యదర్శలకు ఎంపీడీవో సూచించారు.
పారిశుధ్యం లోపించకుండా చూడాలి
పారిశుధ్యం లోపించకుండా చూడాలి


