మోర్తాడ్: గుర్తుతెలి యని దుండగులు పొ క్లెయిన్‌ని చోరీ చేయ గా, ఈ ఘటన సా మాజిక మాధ్యమా ల్లో వైరల్ కావడంతో వాహనాన్ని వదిలేశారు. వివరాలు ఇలా.. భీమ్‌గల్ మండలం జాగిర్యాల్‌లో చిన్నోల్ల గంగాప్రసాద్ తన పొక్లెయిన్‌ని శుక్రవారం రాత్రి ఇంటి వెనుక ఉన్న ఖా ళీ స్థలంలో నిలిపి ఉంచారు. శనివారం ఉదయం లే చి చూసేసరికి పొక్లెయిన్ కనిపించకపోవడంతో డ్రై వర్ తీసుకువెళ్లి ఉంటాడని భావించాడు. అంతలోనే డ్రైవర్ రావడం పొక్లెయిన్‌ను తాను తీసుకపోలేదని వెల్లడించడంతో చోరీకి గురైనట్లు గుర్తించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. చోరీ విషయం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీంతో పొక్లెయిన్‌ని దొంగలు వేల్పూర్ మండలం పడగల్ క్రాస్‌రోడ్డు వద్ద పొదల్లో నిలిపి ఉంచగా, స్థానికులు గమనించి వాహన యజమానికి సమాచారం ఇచ్చారు. దీంతో పొక్లెయిన్‌ను వారు స్వాధీ నం చేసుకున్నారు. నిందితులను గుర్తించడానికి పో లీసులు సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నట్లు తెలిసింది.