జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్ల ఖరారు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్ల ఖరారు

Oct 14 2026 12:11 AM | Updated on Oct 14 2026 12:11 AM

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): జిల్లాలో జెడ్పీటీసీ, ఎంపీపీ రిజర్వేషన్లు ఖరారు చేస్తూ కలెక్టర్‌ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఎంపీపీల రిజర్వేషన్లు ఇలా..

గొల్లప్రోలు (అన్‌ రిజర్వ్‌డ్‌), కాజులూరు (బీసీ), కాకినాడ రూరల్‌ (బీసీ), కరప (జనరల్‌), పెదపూడి (జనరల్‌), పిఠాపురం (జనరల్‌), తాళ్లరేవు (బీసీ మహిళ), కొత్తపల్లి (బీసీ), గండేపల్లి (ఎస్సీ మహిళ), జగ్గంపేట (బీసీ మహిళ), కిర్లంపూడి (జనరల్‌ మహిళ), కోటనందూరు (జనరల్‌ మహిళ), పెద్దాపురం (ఎస్సీ), ప్రత్తిపాడు (జనరల్‌ మహిళ), రౌతులపూడి (జనరల్‌), సామర్లకోట (జనరల్‌ మహిళ), శంఖవరం (జనరల్‌), తొండంగి (బీసీ మహిళ), తుని రూరల్‌ (బీసీ మహిళ), ఏలేశ్వరం (ఎస్సీ మహిళ).

జెడ్పీటీసీల రిజర్వేషన్లు

గొల్లప్రోలు (బీసీ మహిళ), కాజులూరు (ఎస్సీ మహిళ), కాకినాడ రూరల్‌ (జనరల్‌ మహిళ), కరప (బీసీ మహిళ), పెదపూడి (బీసీ), పిఠాపురం (ఎస్సీ మహిళ), తాళ్లరేవు (జనరల్‌ మహిళ), యు. కొత్తపల్లి (జనరల్‌ మహిళ), గండేపల్లి (బీసీ మహిళ), జగ్గంపేట (జనరల్‌), కిర్లంపూడి (జనరల్‌), కోటనందూరు (ఎస్సీ), పెద్దాపురం (జనరల్‌ మహిళ), ప్రత్తిపాడు (బీసీ), రౌతులపూడి (బీసీ మహిళ), సామర్లకోట (జనరల్‌), శంఖవరం (బీసీ), తొండంగి (జనరల్‌), తుని రూరల్‌ (జనరల్‌), ఏలేశ్వరం (జనరల్‌).

వీఆర్‌ఏల వినూత్న నిరసన

ఏలేశ్వరం: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ 28 రోజులుగా సమ్మె చేస్తున్న గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) మంగళవారం మోకాళ్లపై నిలుచుని వినూత్నంగా నిరసన తెలిపారు. స్థానిక తహసీల్దార్‌ కార్యాలయం వద్ద వారు రిలే దీక్షలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, వీఆర్‌ఏలకు పేస్కేల్‌, అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వాలని, నామినీలుగా పని చేస్తున్న వారిని వీఆర్‌ఏలుగా నియమించాలని డిమాండ్‌ చేశారు. కేవలం రూ.10 వేల జీతంతో జీవనం కష్టంగా ఉందని, ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించాలని కోరారు. కార్యక్రమంలో పలువురు వీఆర్‌ఏలు పాల్గొన్నారు.

ఉద్యోగ, ఉపాధ్యాయ

సమస్యల పరిష్కారానికి కృషి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల సమస్యల పరిష్కారానికి సమన్వయంతో కృషి చేస్తామని కలెక్టర్‌ హరేంధిర ప్రసాద్‌ తెలిపారు. కలెక్టరేట్‌లో మంగళవారం జిల్లా స్థా యిలో నిర్వహించిన రెండో జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ సమావేశానికి ఆయన అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా వివిధ ఉద్యోగ, ఉపాధ్యా య సంఘాల ప్రతినిధులు తమ సమస్యలు ప్రస్తావించారు. 12వ పీఆర్‌సీ అమలు, డీఏ బకాయిల చెల్లింపు, ఉద్యోగుల ఆరోగ్య పథకం (ఈహెచ్‌ఎస్‌) ద్వారా మెరుగైన వైద్య సేవలు, కారుణ్య నియామకాలు, ఉద్యోగోన్నతులు, బదిలీలు, సీనియారిటీ, బకాయిల చెల్లింపు తదితర సమస్యలపై వినతులు సమర్పించారు. జిల్లా స్థాయిలోని సమస్యలను త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని, రాష్ట్ర స్థాయికి సంబంధించిన అంశాలను సంబంధిత శాఖల అధికారుల దృష్టికి తీసుకెళ్తామని కలెక్టర్‌ తెలిపారు. ఈహెచ్‌ఎస్‌ ఇబ్బందుల పరిష్కారంపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తామని, ఆసుపత్రుల్లో అత్యవసర వైద్య సేవలు సకాలంలో అందేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అంకితభావంతో పని చేయాలి

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): విభిన్న ప్రతిభావంతులు అంకితభావంతో పని చేయాలని కలెక్టర్‌ ఎంఎన్‌ హరేంధిర ప్రసాద్‌ అన్నారు. జిల్లాలో ఖాళీగా ఉన్న 24 విభిన్న ప్రతిభావంతుల బ్యాక్‌లాగ్‌ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు ఆయన కలెక్టరేట్‌లో మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో 4వ తరగతి, పరిపాలనా విభాగం కింద 11, ఇతర కేటగిరీల పరిధిలో 13 పోస్టులు భర్తీ చేశామని వివరించారు. ఎంపికైన వారిలో అంధత్వ లోపం ఉన్నవారు ఏడుగురు, చెముడు, మూగ బాధితులు 12 మంది, శారీరక వైకల్యం ఉన్నవారు ఇద్దరు, మానసిక దివ్యాంగులు ముగ్గురు ఉన్నారని తెలిపారు. వీరందరినీ ఉమ్మడి జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల పరిధిలో నియమించామని కలెక్టర్‌ చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement