ఎన్నికల ప్రశాంత నిర్వహణకు సహకరించాలి | - | Sakshi
Sakshi News home page

ఎన్నికల ప్రశాంత నిర్వహణకు సహకరించాలి

Oct 14 2026 12:11 AM | Updated on Oct 14 2026 12:11 AM

సామర్లకోట: స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు అందరూ సహకరించాలని ఎస్పీ జి.బిందుమాధవ్‌ విజ్ఞప్తి చేశారు. మండలంలో అత్యంత సమస్యాత్మక గ్రామమైన వేట్లపాలెంలోని పోలింగ్‌ కేంద్రాలను ఆయన మంగళవారం పరిశీలించారు. బేతాళస్వామి ఆలయం సమీపంలోని జెడ్పీ హైస్కూల్‌లోని పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించి, సిబ్బందికి సూచనలు ఇచ్చారు. ఇక్కడ సుమారు 4 వేల ఓట్లు ఉన్నాయని, ఓటు వేసిన తరువాత ఓటర్లు మరో మార్గంలో బయటకు వెళ్లేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. గ్రామంలోని పోలింగ్‌ కేంద్రాలకు సంబంధించిన ఓట్ల లెక్కింపు హైస్కూల్‌లోనే జరుగుతోందని గమనించి, కౌంటింగ్‌కు నూతన భవనంలో ఏర్పాట్లు చేసుకోవాలని స్పష్టం చేశారు. గ్రామంలోని ఎస్సీ పేటలో సుమారు రెండేళ్ల క్రితం ముగ్గురు హత్యకు గురైన విషయం తెలుసుకుని, అక్కడి పోలింగ్‌ కేంద్రాలను ఎస్పీ పరిశీలించారు. మంగాయ్యమ్మపేట ప్రాథమిక పాఠశాలలోని పోలింగ్‌ కేంద్రాన్ని కూడా సందర్శించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో లైటింగ్‌, క్యూ లైన్లు, సీసీ కెమెరాలు, దివ్యాంగులకు ర్యాంపులు, ఇంటర్నెట్‌, మరుగుదొడ్లు, తాగునీరు, వైద్య సదుపాయాలు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో స్పెషల్‌ బ్రాంచి డీఎస్పీ కేవీవీ సత్యనారాయణ, సీఐ ఎ.కృష్ణభగవాన్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement