జీజీహెచ్‌లో మరో ప్రాణం బలి | - | Sakshi
Sakshi News home page

జీజీహెచ్‌లో మరో ప్రాణం బలి

Oct 13 2026 12:23 AM | Updated on Oct 13 2026 12:23 AM

కాకినాడ క్రైం: వైద్యుల నిర్లక్ష్యానికి కాకినాడ జీజీహెచ్‌లో మరో వ్యక్తి బలైపోయాడు. స కాలంలో ఐసీయూలో చేర్చకపో వడంతో ప్రాణాలు కోల్పోయా డు. వివరాలివీ.. స్థానిక దుమ్ములపేటకు చెందిన సయ్యద్‌ ర బ్బానీ (38) ఓ ఆటో డ్రైవర్‌. అతడికి భార్య ఫర్జా నా, ఇద్దరు కుమార్తెలు యాస్మిన్‌, మెహబూబ్‌ ఉన్నీసా ఉన్నారు. భార్యాభర్తల మధ్య జరిగిన ఓ ఘర్షణలో రబ్బానీ ఈ నెల 9న శుభ్రత కోసం వాడే ఓ రసాయనం తాగాడు. కుటుంబ సభ్యులు జీజీహెచ్‌లో చేర్చగా ఎం–2 వార్డులో చికిత్స అందిస్తున్నారు. రబ్బానీ ఆరోగ్యం విషమించిందని, ఐసీయూలో చేర్చాలని సిబ్బందికి డ్యూటీ డాక్టర్‌ సోమవారం ఉదయం చెప్పి విధులు ముగించుకుని వెళ్లారు. తర్వాత వచ్చిన డ్యూటీ వైద్యుడు తాను ఐసీయూలో చేర్చనని, ముందున్న వైద్యు డు మాత్రమే వచ్చి చేర్చాలని చెప్పి వార్డులోనే ఉంచేశాడు. రబ్బానీ భార్య ఫర్జానా ఎంత వేడుకున్నా పట్టించుకోలేదు. కొద్దిసేపటికి బాధితుడు అరుస్తూ మంచంపై నుంచి కిందికి దిగి వెళ్లిపోయేందుకు ప్రయత్నించాడు. వైద్యులు వచ్చి, మ త్తు ఇంజక్షన్‌ ఇచ్చినా నియంత్రణ రాకపోవడంతో వెంటనే మరో ఇంజక్షన్‌ ఇచ్చారు. ఆ వెంటనే రబ్బానీ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. అతడు మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. దీంతో, ఫర్జానా సహా కుటుంబ సభ్యులు ఆందో ళనకు దిగారు. వారిని అధికారులు సముదాయించి రబ్బానీ మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. తన భర్తను సకాలంలో ఐసీయూలో చేర్చకుండా వైద్యులు నిర్లక్ష్యంతో పొట్టన పెట్టుకున్నారని, ఫర్జానా విలపించింది. ఐసీయూలో బెడ్‌లు లేవని కొందరు, మీ డ్యూటీ డాక్టర్‌ తాను కాదని మరికొందరు వైద్యం చేయకుండా ప్రాణాలు తీశారని రోదించింది. ఈ ఘటనపై సర్పవరం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది.

ఒంటి కాలిపై వీఆర్‌ఏల నిరసన

ప్రత్తిపాడు: తమ న్యాయమైన సమస్యలు పరిష్కరించాలనే డిమాండుతో సమ్మె చేపట్టిన గ్రామ రెవెన్యూ సహాయకులు (వీఆర్‌ఏ) సోమవారం ఒంటి కాలిపై నిరసన చేపట్టారు. వీఆర్‌ఏల సంఘం మండల అధ్యక్షుడు కొమరగిరి కృష్ణ నాయకత్వంలో ప్రత్తిపాడులో వారు కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారు. ఈ సందర్భంగా కృష్ణ మాట్లాడుతూ, తెలంగాణ మాదిరిగా తమ సర్వీసు రెగ్యులర్‌ చేసి, పే స్కేలు అమలు చేయాలని కోరుతున్నామన్నారు. నామినీలుగా పని చేస్తున్న వారందరినీ వన్‌ టైం సెటిల్‌మెంట్‌గా వీఆర్‌ఓలుగా నియమించాలని, 70 శాతం వీఆర్‌ఏలకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్‌ చేశారు.

ఓపెన్‌ స్కూల్‌ పరీక్ష ఫీజు

గడువు పెంపు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే ఓపెన్‌ స్కూల్‌ పదో తరగతి, ఇంటర్మీడియెట్‌ పరీక్ష ఫీజు గడువును రూ.200 ఫైన్‌తో ఈ నెల 31 వరకూ పెంచినట్లు జిల్లా విద్యాశాఖాధికారి పిల్లి రమేష్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారు సంబంధిత కో ఆర్డినేటర్‌ను తప్పకుండా సంప్రదించాలని సూచించారు. సందేహాలుంటే జిల్లా కో ఆర్డినేటర్‌ను 63045 95699 నంబరులో సంప్రదించాలని తెలిపారు.

స్పెషల్‌ టెట్‌కు

967 మంది హాజరు

బాలాజీచెరువు (కాకినాడ సిటీ): జిల్లావ్యాప్తంగా సోమవారం రెండు సెషన్లలో నిర్వహించిన స్పెషల్‌ టీచర్‌ ఎలిజిబులిటీ టెస్ట్‌(టెట్‌)కు 967 మంది హాజరయ్యారు. డీఈఓ పిల్లి రమేష్‌ సోమవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. ఉదయం పరీక్షకు 674 మంది, మధ్యాహ్నం 293 మంది హాజరయ్యారన్నారు.

రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగికి

సైబర్‌ టోకరా

కాకినాడ క్రైం: రిటైర్డ్‌ బ్యాంకు ఉద్యోగి ఒకరు సైబర్‌ ఉచ్చులో చిక్కుకుని డబ్బు కోల్పోయాడు. కాకినాడ శారదా దేవి గుడి సమీపాన నివాసం ఉంటున్న జయంతి శ్రీనివాస్‌ 212 ట్రేడ్‌ పేరిట ఉన్న ఓ స్టాక్‌ మార్కెట్‌ ట్రేడింగ్‌ కంపెనీలో ఆరు నెలల వ్యవధిలో దశల వారీగా రూ.5 లక్షల పెట్టుబడి పెట్టారు. ఎటువంటి రాబడీ రాకపోవడంతో ఆ సంస్థ సిబ్బందితో మాట్లాడాడు. మీ ధనం అనుమానాస్పదమైందని, సక్రమ సంపాదన కాకపోవచ్చని, మరో రూ.15 లక్షలు పెట్టుబడి పెడితో మొత్తం వెనక్కి వస్తాయని అవతలి వ్యక్తి చెప్పాడు. దీనిపై అనుమానం వచ్చిన శ్రీనివాస్‌కు తెలిసిన వారిని సంప్రదించగా.. అది ఓ ఫేక్‌ కంపెనీ అని తేల్చారు. దీంతో, కంగు తిన్న బాధితుడు సీఐడీకి ఫిర్యాదు చేశారు. వారి సిఫారసు మేరకు, బాధితుడి ఫిర్యాదుతో సోమవారం రాత్రి త్రీ టౌన్‌ పోలీసులు కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement