పెద్దాపురం.. పోటీ తీవ్రం! | - | Sakshi
Sakshi News home page

పెద్దాపురం.. పోటీ తీవ్రం!

Oct 13 2026 12:23 AM | Updated on Oct 13 2026 12:23 AM

పెద్దాపురం మున్సిపల్‌ చైర్మన్‌ పీఠాన్ని గత ఎన్నికల్లో బీసీ మహిళకు కేటాయించారు. ఈసారి అన్‌ రిజర్వ్‌ చేశారు. దీంతో, పోటీ తీవ్రం కానుంది. మున్సిపాలిటీలో అత్యధికంగా బీసీ సామాజికవర్గం ఓటర్లు ఉండటంతో ఇక్కడ ఆ వర్గానికి చెందిన అభ్యర్థినే పోటీకి దింపే సూచనలు కనిపిస్తున్నాయి. గతంలో రెండుసార్లు మున్సిపల్‌ చైర్మన్‌గా పని చేసిన రాజా సూరిబాబు కూటమి అభ్యర్థిగా ఇప్పుడు బరిలో ఉన్నారు. జనసేన నుంచి కమ్మ సామాజికవర్గానికి చెందిన నెక్కంటి సాయిప్రసాద్‌ ఉన్నట్లు తెలిసింది. ఇదిలా ఉండగా చైర్మన్‌ పీఠం కోసం కూటమిలో విభేదాలు మొదలయ్యాయి. ఈ పదవి తమకు దక్కాలంటే తమకంటూ జనసేన, టీడీపీ నేతలు పావులు కదుపుతున్నారు. వైఎస్సార్‌ సీపీ నుంచి దీటైన అభ్యర్థిని రంగంలోకి దింపేందుకు అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి.

సామర్లకోట..

ఎన్నడూ లేని రీతిలో..

సామర్లకోట మున్సిపాలిటీ 1956లో ఏర్పడింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ చైర్మన్‌ స్థానం బీసీ మహిళకు దక్కలేదు. ఈసారి బీసీ మహిళకు కేటాయిస్తారని అందరూ భావించగా.. అందుకు భిన్నంగా ఎస్సీ–జనరల్‌కు కేటాయించారు. సామర్లకోటను జనసేన ఆశిస్తూండటం, అందుకు చంద్రబాబు నుంచి సైతం గ్రీన్‌ సిగ్నల్‌ రావడంతో ఎస్సీ రిజర్వ్‌ చేసినట్లు ఆరోపణలున్నాయి. చైర్మన్‌ రేసులో జనసేన నుంచి పిట్టా జానకి రామారావు, టీడీపీ నుంచి పాతపూడి కృష్ణబాబు ఉన్నట్లు తెలిసింది. సామర్లకోట మున్సిపాలిటీలో 31 వార్డులుండగా గత ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ఏకంగా 29 వార్డులు కై వసం చేసుకుంది. టీడీపీ కేవలం రెండు వార్డులకే పరిమితమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement