గొల్లప్రోలు స్టేషన్‌ను పరిశీలించిన డీఆర్‌ఎం | - | Sakshi
Sakshi News home page

గొల్లప్రోలు స్టేషన్‌ను పరిశీలించిన డీఆర్‌ఎం

Oct 6 2026 12:18 AM | Updated on Oct 6 2026 12:18 AM

గొల్లప్రోలు (పిఠాపురం రూరల్‌): దక్షిణ కోస్తా రైల్వే విజయవాడ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ (డీఆర్‌ఎం) మోహిత్‌ సునాకియా సోమవారం గొల్లప్రోలు రైల్వే స్టేషన్‌ను పరిశీలించారు. సామర్లకోట నుంచి తుని వరకు రైల్వే పరంగా జరుగుతున్న వివిధ అభివృధ్ధి కార్యక్రమాలను పరిశీలించి, ఇంజినీరింగ్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి వివరాలను స్టేషన్‌ మాస్టర్‌ కేఎస్‌ఆర్‌ స్వామిని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో సీనియర్‌ డీఎం సురేష్‌రెడ్డి, సీనియర్‌ డీఈఎన్‌ఆర్‌ గౌతమ్‌ తదితరులు పాల్గొన్నారు.

దసరాకు ప్రత్యేక బస్సులు

బోట్‌క్లబ్‌ (కాకినాడ సిటీ): దసరా సందర్భంగా ఈ నెల 9 నుంచి 21వ తేదీ వరకూ హైదరాబాద్‌, విజయవాడకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. జిల్లా ప్రజా రవాణా అధికా రి (డీపీటీవో) కె.రమేష్‌ సోమవారం విలేకర్లకు ఈ విషయం తెలిపారు. దసరా ముందు హైదరాబాద్‌ నుంచి కాకినాడ, ఏలేశ్వరం, తుని డిపోలకు 23 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామన్నా రు. దసరా తర్వాత ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అదనపు బస్సులు నడుపుతా మని చెప్పారు. విజయవాడ డిపో నుంచి 114 బస్సులు నడుపుతున్నామన్నారు. ఈ బస్సులకు అడ్వాన్స్‌ రిజర్వేషన్‌ సౌకర్యం ఉందన్నారు. శబరిమల వెళ్లే భక్తుల సౌకర్యార్థం ఈ మూడు డిపోల నుంచీ బస్సులు అద్దెకు ఇస్తామని చెప్పారు. భక్తులు తాము కోరుకున్న చోటు నుంచి కోరిన క్షేత్రాలకు కోరినన్ని బస్సులను అద్దెకు ఇస్తామన్నారు. వివరాలకు 73829 10769 నంబర్‌లో సంప్రదించాలని రమేష్‌ సూచించారు.

ఎస్‌డీపీవోగా దుర్గారావు

కాకినాడ క్రైం: కాకినాడ సబ్‌ డివిజనల్‌ పోలీస్‌ అధికారి(ఎస్‌డీపీవో)గా ఎన్‌ఎస్‌వీకే దుర్గారావు నియమితులయ్యారు. ఈ మేరకు డీజీపీ హరీష్‌ కుమార్‌ గుప్తా సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం ఎన్‌టీఆర్‌ జిల్లా విజయవాడ వెస్ట్‌లో అసిస్టెంట్‌ పోలీస్‌ కమిషనర్‌గా దుర్గారావు పని చేస్తున్నారు.

నేడు వరుణ యాగాలు

రామచంద్రపురం రూరల్‌/అయినవిల్లి: రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితులు నెలకొన్న తరుణంలో సమృద్ధిగా వర్షాలు కురవాలని ప్రార్థిస్తూ ద్రాక్షారామ మాణిక్యాంబా సమేత భీమేశ్వరస్వామి, అయినవిల్లి విఘ్నేశ్వర స్వామి ఆలయాల్లో మంగళవారం వరుణ యాగాలు నిర్వహించనున్నారు. ద్రాక్షారామ ఆలయంలో ఉదయం 6.54 గంటలకు వరుణ యాగం, వరుణ జపం, సహస్ర ఘటాభిషేకం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ, దేవదాయ శాఖ సహాయ కమిషనర్‌ అల్లు వెంకట దుర్గాభవాని సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అయినవిల్లి ఆలయంలో కూడా ఇదే సమయానికి వరుణ జపం, వరుణ యాగం నిర్వహించనున్నట్లు ఆలయ సహాయ కమిషనర్‌, ఈఓ ముదునూరి సత్యనారాయణరాజు పేర్కొన్నారు.

ఉద్యోగాలు రెగ్యులర్‌ చేయాలి

అమలాపురం రూరల్‌: పదహారేళ్లుగా కాంట్రాక్ట్‌ ప్రాతిపదికన పని చేస్తున్నామని, తమ ఉద్యోగాలను వెంటనే రెగ్యులర్‌ చేయాలని పారామెడికల్‌ ఉద్యోగులు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కాంట్రాక్ట్‌ స్టాఫ్‌ నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు, ఇతర పారామెడికల్‌ సిబ్బంది అమలాపురంలోని కలెక్టరేట్‌ వద్ద సోమవారం భారీ నిరసన చేపట్టారు. అనంతరం, కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ, తమ సమస్యలపై చర్చించి, నిర్ణయం తీసుకునేందుకు గతంలో ప్రభుత్వం నెల రోజుల గడువు కోరిందన్నారు. ఆ గడువు ముగిసినప్పటికీ ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందనా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ డిమాండ్లపై ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఇందులో భాగంగా మంగళవారం అత్యవసర సేవలు మినహా, ఇతర విధులు బహిష్కరిస్తామని, బుధవారం నుంచి పూర్తి స్థాయిలో విధులు బహిష్కరిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement