లోవ కొత్తూరు.. అక్రమాల జోరు | - | Sakshi
Sakshi News home page

లోవ కొత్తూరు.. అక్రమాల జోరు

Oct 6 2026 12:18 AM | Updated on Oct 6 2026 12:18 AM

తుని మండలం లోవకొత్తూరు వద్ద పోలవరం ఎడమ ప్రధాన కాలువ తవ్వకంలో ఏర్పడిన మట్టి గుట్టలను సైతం కూటమి నేతలు కొల్లగొట్టేస్తున్నారు. చీకటి పడితే చాలు ఇక్కడ దందా ప్రారంభమైపోతోంది. రాత్రి, పగలు అనే తేడా లేకుండా అక్రమ తవ్వకాలు, తరలింపు నిరాటంకంగా సాగుతున్నా మామూళ్ల మత్తులు అధికారులు పట్టించుకోవడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. ఇక్కడ ట్రాక్టర్‌ మట్టి రూ.1,000 నుంచి రూ.1,200కు విక్రయిస్తున్నారు. రోజుకు 120 నుంచి 200 వరకు ట్రాక్టర్ల మట్టి అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిపోతోంది. వెరసి కూటమి నేతల జేబుల్లోకి రూ.లక్షలు వెళ్తున్నాయి. అక్రమ తవ్వకాలు జరుగుతున్న ప్రాంతానికి కేవలం నాలుగు కిలోమీటర్ల దూరంలోనే పోలవరం ఎస్‌ఈ, ఈఈ, డీఈ కార్యాలయాలున్నాయి. మట్టి అక్రమంగా తరలిస్తున్న విషయం తెలిసినా అధికారులకు చూసీ చూడనట్లు వ్యహరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. ఈ అక్రమాలను అడ్డుకుంటే టీడీపీ ప్రజాప్రతినిధుల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుందనే భయంతోనే వారు వెనకడుగు వేస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

లోవకొత్తూరు సమీప పోలవరం

కాలువ మట్టిని అక్రమంగా తరలిస్తున్న అక్రమార్కులు

●

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement