ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి వారి జీవితాలను అంధకారంలోకి నెట్టారు. గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ హయాంలో ఎన్నో సంక్షేమ పథకాలను మా చేతుల మీదుగా ప్రతి గడపకూ చేర్చాం. కరోనా కష్ట సమయంలో ప్రతి ఇంటికీ వెళ్లి సేవలు అందించాం. తాను అధికారంలోకి వస్తే వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. నిరుద్యోగ భృతి ఇస్తానని అది కూడా అమలు చేయలేదు. చంద్రబాబు నైజం మోసమని జనానికి తెలిసివచ్చేలా చేశారు.
– ఒమ్మి రామకృష్ణ, మున్సిపల్ వలంటీర్ల వింగ్ అధ్యక్షుడు, పెద్దాపురం
కార్యకర్తలకు తాయిలాలు
సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లకు నజరానాల పేరుతో తమ కార్యకర్తలకు తాయిలాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు పథకం వేశారు. గతంలో ఐదేళ్ల పాటు తక్కువ గౌరవ వేతనంతోనే ప్రజలకు ఎంతో సేవ చేశాం. అటువంటి మాకు జీతాలు పెంచుతామని గత ఎన్నికల్లో కూటమి నేతలు వాగ్దానం చేసి, నమ్మించారు. చివరకు మమ్మల్ని అన్యాయంగా ఈ కూటమి ప్రభుత్వం తొలగించింది. మా కుటుంబాలను రోడ్డున పడేసింది.
– బందెల జాన్‌బాబు, మాజీ వలంటీర్, అప్పనరామునిలంక, సఖినేటిపల్లి మండలం


