ప్రతిపక్షంలో ఉండి గెలిచిన వాడే వీరుడు | - | Sakshi
Sakshi News home page

ప్రతిపక్షంలో ఉండి గెలిచిన వాడే వీరుడు

Oct 6 2026 12:18 AM | Updated on Oct 6 2026 12:18 AM

సామర్లకోట: ప్రతిపక్షంలో ఉండి స్థానిక సంస్థల్లో విజయం సాధిస్తే ఆ మజాయే వేరుగా ఉంటుందని రాష్ట్ర హౌసింగ్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌, వైఎస్సార్‌ సీపీ పెద్దాపురం నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ దవులూరి దొరబాబు అన్నారు. పెద్దాపురంలో సర్వమత ప్రార్థనల నడుమ సోమవారం పార్టీ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలనుద్దేశించి మాట్లాడుతూ, ప్రతిపక్షంలో ఉండి స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసి, విజయం సాధించిన వాడే వీరుడని అన్నారు. స్వచ్ఛమైన రాజకీయాలే తన లక్ష్యమని, సెటిల్‌మెంట్లు చేసేవాడిని కాదని చెప్పారు. పెద్దాపురం, సామర్లకోట మున్సిపాలిటీల్లో విజయం సాధించి అధికార పక్షానికి చుక్కలు చూపిస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రజాబలం తమవైపే ఉందన్నారు. బీసీలను మరో పర్యాయం మోసం చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుట్ర చేస్తున్నారని విమర్శించారు. కూటమిలో సీట్ల సర్దుబాటు కుదరనందువల్లనే మున్సిపల్‌ ఎన్నికల్లో జాప్యం జరుగుతోందని చెప్పారు. సోనియా గాంధీయే వైఎస్సార్‌ సీపీని ఏమీ చేయలేకపోయిందని స్థానిక అధికార పక్ష నాయకులకు ఆయన చురక వేశారు. తమ వద్ద సెటిల్‌మెంట్‌ నాయకులు లేరన్నారు. ఇప్పటి వరకు పెద్దాపురంలో కలుగజేసుకోలేదని, ఇక నుంచి ప్రతి రోజూ పెద్దాపురంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తలకు అందుబాటులో ఉంటానని దొరబాబు చెప్పారు. పెద్దాపురంలో అందరినీ కలసి వారి మద్దతు తీసుకుంటామని తెలిపారు. రెండు మున్సిపాలిటీల్లోనూ విజయమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ ఐకమత్యంతో పని చేసి పార్టీ జెండా ఎగురవేయాలని పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసిన ప్రతి ఒక్కరికి పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత ప్రత్యేక గుర్తింపు ఉంటుందని చెప్పారు. పెద్దాపురంలో కమిటీలను రద్దు చేశామని, ఉత్సాహంగా పని చేసే వారికి కమిటీలో స్థానం ఇవ్వడంతో పాటు బీమాతో కూడిన గుర్తింపు కార్డులు జారీ చేస్తామని దొరబాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అయ్యరక సంఘం అధ్యక్షుడు ఆవాల లక్ష్మీనారాయణ, మాజీ అయ్యరక కార్పొరేషన్‌ చైర్‌పర్సన్‌ ఆవాల రాజేశ్వరి, ఆప్కో మాజీ డైరెక్టర్‌ ముప్పన వీర్రాజు, సీనియర్‌ నాయకులు దవులూరి సుబ్బారావు, జనార్దన్‌, మహిళా విభాగం నియోజకవర్గ అధ్యక్షురాలు సేపెని రూప, పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కానేటి రాజేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శి బండారు వీరబాబు, నిడదవోలు సురేష్‌ చౌదరి, జిల్లా సహాయ కార్యదర్శి తాటికొండ అచ్చిరాజు, మైనార్టీ విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు మహమ్మద్‌ కరీం జానీ, పార్టీ పెద్దాపురం పట్టణ అధ్యక్షుడు కాపుగంటి కామేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

ఫ వైఎస్సార్‌ సీపీ నియోజకవర్గ

కో ఆర్డినేటర్‌ దొరబాబు

ఫ పెద్దాపురంలో పార్టీ

కార్యాలయం ప్రారంభం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement