కూరగాయ హారాల అలంకారంతో..
ఆకుకూరల తోరణాలతో.. ఆ చల్లని తల్లి తలుపులమ్మ మెరిసిపోగా.. చూసిన ప్రతి మది మురిసిపోయింది. చూసిన కనులదే భాగ్యం అన్నట్టు తుని రూరల్ లోవ దేవస్థానంలో తలుపులమ్మ వారు శాకంబరిగా దర్శనమిచ్చారు. ఆషాఢమాసం మూడో ఆదివారం కావడంతో రెండు టన్నుల కూరగాయలు, ఆకుకూరలు, వివిధ రకాల పండ్లతో స్వయంభూవుగా వెలసిన అమ్మవారిని, పంచలోహ విగ్రహాలను అలంకరించారు. ప్రధాన గర్భాలయానికి ఆకుకూరలు, కూరగాయల తోరణాలను కట్టడం ఆకట్టుకుంది.
– తుని రూరల్


