సెంటినరీ ఆంధ్రా బాప్టిస్ట్ చర్చి
జగన్నాథపురం చర్చి స్క్వేర్ సెంటర్‌లో సెంటినరీ ఆంధ్రా బాపిస్ట్ చర్చిని 1870లో సువిశాల ప్రాంగణంలో నిర్మించారు. దీని నిర్మాణం పూర్తయిన తరువాత మిషనరీ రెవరెండ్ జాన్ మెక్ లారిన్ ఇక్కడ దాదాపు తొమ్మిది సంవత్సరాల పాటు పని చేశారు. ఈ చర్చిలో బ్రిటిష్ నిర్మాణ శైలి స్పష్టంగా కనపడుతుంది. పూర్తి రాతి కట్టడం కావడంతో ఇప్పటికీ ఇసుమంత కూడా చెక్కు చెదరకుండా నిలిచింది. ఈ చర్చి ఆధ్వర్యాన క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.
క్రెగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చి
కాకినాడ అర్బన్ తహసీల్దార్ కార్యాలయం ఎదురుగా ఉన్న క్రెగ్ మెమోరియల్ బాప్టిస్ట్ చర్చికి కూడా వందేళ్లకు పైబడిన చరిత్ర ఉంది. ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ఎంతో కోలాహలంగా జరుగుతాయి. వేలాదిగా భక్తులు తరలివస్తారు.


