
అయస్కాంతాన్ని మింగేసిన బాలిక
తొలగించిన వైద్యులు
ప్రత్తిపాడు రూరల్: మండలంలోని బురదకోట గ్రామ పంచాయతీ బాపన్నధార గిరిజన గ్రామానికి చెందిన మాడెం రమ్య ఓ తినుబండారం ప్యాకెట్‌లో ఉన్న అయస్కాంతం ముక్కను మింగేసింది. ఆ బాలికను కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి దానిని వైద్యులు తొలగించారు. మాడెం రమ్య బురదకోటలోని గిరిజన ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. రింగ్ ప్యాకెట్లు తినే అలవాటు ఉన్న బాలిక ఆ ప్యాకెట్‌లోని తిను బండారాలతో పాటు అయస్కాంతం ముక్కను కూడా మింగేసింది. ఆమెను ప్రత్తిపాడు, ఏలేశ్వరంలోని ప్రైవేట్ ఆసుపత్రులకు తరలించి వైద్య సేవలు అందించగా ఫలితం లేకపోవడంతో కాకినాడలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి అయస్కాంతం ముక్కను తొలగించారు. ఈ అంశంపై సంబంధిత రింగ్ కంపెనీపై న్యాయ పోరాటం చేస్తామని బాలిక తల్లిదండ్రులు తెలిపారు.

అయస్కాంతాన్ని మింగేసిన బాలిక