
ప్రవర్తన నియమావళిపై పట్టు సాధించాలి
సామర్లకోట: ప్రభుత్వ ఉద్యోగుల ప్రవర్తన నియమావళి (సీపీఏ)పై ఎంపీడీఓలు పట్టు సాధించాలని కొత్తపేట ఎంపీడీఓ పీఎస్ నరేష్‌కుమార్ తెలిపారు. శనివారం స్థానిక విస్తరణ శిక్షణ కేంద్రంలో ఎంపీడీఓలకు ఇస్తున్న శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొని శిక్షణ ఇచ్చారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో పదోన్నతి పొందిన ఎంపీడీఓలకు ఇక్కడ శిక్షణ ఇస్తున్నారు. ఆరో రోజు శిక్షణలో ఆయన పాల్గొని మాట్లాడుతూ విధి నిర్వహణలో నిర్లక్ష్యం, ఇతర ఽఅధికారులు, ప్రజాప్రతినిధులతో కుమ్మక్కు అయినట్లు రుజువైతే శిక్ష ఉంటుందన్నారు. కింది స్థాయి సిబ్బంది తప్పులు చేసిన సమయంలో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి వారిని సస్పెండ్ చేసే అధికారం ఉంటుందన్నారు.