
ఆర్మీ ర్యాలీ, హాకీ టోర్నీలకు రూ.లక్ష విరాళం
బోట్‌క్లబ్ (కాకినాడ): స్థానిక జిల్లా క్రీడా మైదానంలో ఈ నెల 5 నుంచి 20 వరకూ జరుగుతున్న ఆర్మీ రిక్రూట్‌మెంట్ ర్యాలీ, జాతీయ జూనియర్ హాకీ టోర్నీలకు శ్యామ్ ఇనిస్టిట్యూట్ రూ. లక్ష విరాళాన్ని అందజేసింది. శనివారం జిల్లా కలెక్టరేట్‌లో శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత జి.శ్యామ్, డైరెక్టర్ శైలజా రూ.లక్ష చెక్కును కలెక్టర్ షణ్మోహన్‌కు అందజేశారు. శుక్రవారం విడుదలైన కానిస్టేబుట్ ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకుతోపాటు 6,014 పోస్టులకు గాను 4,005 పోస్టులు శ్యామ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులే సాధించడంతో అధినేత శ్యామ్‌ను కలెక్టర్ ప్రత్యేకంగా అభినందించారు.