సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో చక్రం తిప్పుతున్న ఆ ముగ్గురు
సమాంతర కాల్వకు
నీటి సరఫరా
అమరచింత: జూరాల జలాశయంలో రోజురోజుకు నీటిమట్టం తగ్గుతుందని చెబుతున్న అధికారులు సమాంతర కాల్వకు మాత్రం నీటి సరఫరాను నిలిపివేయలేకపోతున్నారు. ప్రస్తుతం కుడి, ఎడమ కాల్వలకు నీటిని నిలిపివేసిన అధికారులు సమాంతర కాల్వకు మాత్రం నీటిని వదలడం ఏమిటని ఆయకట్టు రైతులు ప్రశ్నిస్తున్నారు. సమాంతర కాల్వ ద్వారా రోజు 900 క్యూసెక్కుల నీరు పారుతోందని.. ఎగువన ఉన్న ఆయకట్టు పంటలు ఎండుముఖం పడుతున్నా పట్టించుకోని అధికారులు సమాంతర కాల్వకు మాత్రం సాగునీటిని ఎందుకు సరఫరా చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జలాశయానికి ఎగువ నుంచి వరద వస్తున్న సమయంలోనే సమాంతర కాల్వకు నీటిని విడుదల చేయాలనే నిబంధన ఉన్నా వరద లేని సమయంలో కూడా నీటిని వదలడం ఏమిటని రైతులు అధికారుల వైఖరిని తప్పుబడుతున్నారు. ఈ విషయాన్ని సమాంతర కాల్వ ఏఈ మహేందర్ వద్ద ప్రస్తావించగా.. లిఫ్ట్‌లకు సాగునీటిని పంపింగ్ చేస్తున్నట్లుగానే సమాంతర కాల్వకు నీటిని వదులుతున్నారని, కాల్వ పరిధిలో వరి పంటలు ఎండిపోకుండా నీటిని సరఫరా చేస్తున్నామని బదులిచ్చారు.
అవినీతికి అలవాటుపడిన సదరు సబ్‌రిజిస్ట్రార్‌కు గతంలో అదే కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసిన ఇద్దరు స్టాంప్ వెండర్లు, అదేవిధంగా మరో స్టాంప్ వెండర్ అవినీతిలో చక్రం తిప్పుతున్నట్లు బాహాటంగానే చెప్పుకొంటున్నారు. గతంలో కార్యాలయంలో పనిచేసిన అనుభవం ఉండడంతో లొసుగులు ఉన్న భూములు, ప్లాట్లను డబ్బులిస్తే రిజిస్ట్రేషన్లు చేయిస్తారనే పేరుంది. అక్రమాల్లో ముగ్గురు కూడా తాము ఎంత చెబితే అంత అన్న చందంగా.. తాము చెిప్పిందే శాసనంగా వ్యవహరిస్తుంటారనే టాక్ ఉంది. కలెక్టరేట్ అధికారులు చేపట్టిన రహస్య విచారణ ఎంత వరకు వస్తుందో.. ఎవరిపై చర్యలు తీసుకుంటారో.. అవినీతి అధికారిపై చర్యలు ఏమేరకు తీసుకుంటారోనని ఆసక్తి రేపుతుంది.
గద్వాల: జిల్లాకేంద్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరుగుతున్న అవినీతిపై చర్యలు తీసుకునే నాథుడే కరువయ్యారు. ఇటీవల ప్రభుత్వ భూములు, నిషేధిత జాబితాలోని సర్వే నంబర్లలో భూములకు సంబంధించి ప్లాట్లను రిజిస్ట్రేషన్ చేసిన వైనంపై ‘సాక్షి’ దినపత్రికలో ఈ నెల 8న ‘కాసులిస్తేనే పనులు’ అదేవిధంగా ఈ నెల 9న ‘అవినీతి బాగోతంపై కలెక్టర్ సీరియస్’ వరుస కథనాలు ప్రచూరితమయ్యాయి. అయితే అక్రమాలకు పాల్పడుతున్న సదరు సబ్‌రిజిస్ట్రార్ మాత్రం నన్నెవరు అడిగేది.. నా రూటే సప‘రేటు’.. నాకు రాజకీయ నాయకులు తెలుసు.. ఎవరికీ భయపడను అంటూ కాలర్ ఎగరేస్తున్నారు. ఈ క్రమంలోనే నిషేధిత జాబితాలోని ఉన్న ప్రభుత్వ భూములకు సంబంధించి మరో రెండు సర్వే నంబర్లు 860, 908లలో ప్లాట్లకు దర్జాగా రిజిస్ట్రేషన్లు చేశాడంటే సదరు సబ్‌రిజిస్ట్రార్ బరితెగింపు ఏ స్థాయిలో ఉందో స్పష్టమవుతుంది. ఇదిలా ఉండగా.. సోమవారం కలెక్టర్ ఆదేశాల మేరకు కలెక్టరేట్ అధికారులు మధ్యాహ్నం గద్వాల సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రహస్య విచారణ చేసినట్లు సమాచారం. సుమారు గంటపాటు రికార్డులు తనిఖీలు చేసినట్లు తెలిసింది.
డబ్బులిస్తే గద్వాలను కూడా అమ్మేసే ఘనుడు.. అధికారం చేతిలో ఉంది కదా అని అవినీతికి అలవాటు పడిన సదరు అధికారి డబ్బులు ఎక్కువగా ఇస్తే ప్రభుత్వ భూములను ఇష్టారీతిగా రిజిస్ట్రేషన్ చేసేస్తాడు.. ఇంకా ఎక్కువ ఎవరైనా ఇచ్చేవారుంటే గద్వాలను సైతం అమ్మేసి రిజిస్ట్రేషన్ చేసేందుకు వెనుకాడడని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే ఉద్యోగులు, పైరవీకారులు బాహాటంగానే చర్చించుకుంటున్నారంటే సదరు అధికారి అవినీతి ఏస్థాయిలో ఉందో స్పష్టమవుతుంది.
వెలుగులోకి మరికొన్ని..
సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగే అవినీతి బాగోతం తవ్వేకొద్దీ వెలుగులోకి వస్తుంది. ఇదివరకే నిషేధిత జాబితాలో ఉన్న సర్వే నంబర్ 1024లో పలువురి పేరిట రిజిస్ట్రేషన్లు చేసిన ఘటనలు వెలుగు చూడగా.. తాజాగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములకు సంబంధించి సర్వే నంబర్లు 860, 908లలో ఐదు ప్లాట్లు రిజిష్టర్ చేశారు. వాస్తవానికి ఈ సర్వే నంబర్లలో 860 అసైన్డ్ భూమి కాగా, సర్వే నంబర్ 908 ప్రభుత్వ భూమి అని రెవెన్యూ రికార్డుల్లో స్పష్టంగా పేర్కొనబడింది. ఇలాంటి భూములను క్రయవిక్రయాలు జరపడం నిబంధనలకు విరుద్ధం. ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న అధికారే ఇలా బరితెగించి అక్రమ పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేయడం గమనార్హం.
గంటపాటు విచారణ..
సబ్ రిజిస్ట్రార్ అవినీతి బాగోతంపై కలెక్టర్ రిజ్వాన్‌బాషాషేక్ సీరియస్ అయ్యారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని కలెక్టరేట్ అధికారులను ఆదేశించినట్లు తెలిసింది. ఈ క్రమంలో సోమవారం కలెక్టరేట్ అధికారులిద్దరు మధ్యాహ్నం 3 గంటల సమయంలో గద్వాల సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లి.. గంటపాటు రిజిస్ట్రేషన్లకు సంబంధించిన రికార్డులను పరిశీలించారు. అలాగే రిజిస్ట్రేషన్లు చేసే క్రమంలో పాటించే నియమ నిబంధనలు, అవసరమైన డాక్యుమెంట్లు తదితర వివరాలను సదరు సబ్‌రిజిస్ట్రార్ నుంచి తెలుసుకున్నట్లు సమాచారం.
కొత్తగా నిషేధిత జాబితాలోని సర్వే
నంబర్లు 860, 908లో రిజిస్ట్రేషన్లు
‘సాక్షి’ వరుస కథనాలతో కలెక్టరేట్ అధికారుల విచారణ
అవినీతి అధికారిపై చర్య తీసుకోవాలని ప్రజల డిమాండ్


