ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని వర్షాభావ మండలాలను వెంటనే కరువు ప్రాంతాలుగా ప్రకటించి, పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.30 వేల చొప్పున పరిహారం చెల్లించాలి. వలసలను అరికట్టడానికి ఉపాధి హామీ పనిదినాలను 120 నుంచి 200 రోజులకు పెంచి పనులు కల్పించాలి. మండల కేంద్రాల్లో తక్షణమే ఉచిత పశుగ్రాస డిపోలు, తాగునీటి సౌకర్యాలు ఏర్పాటు చేసి పాలమూరును కరువు కోరల నుంచి కాపాడాలి.
– వెంకటస్వామి, జిల్లా కార్యదర్శి,
తెలంగాణ రైతు సంఘం (ఏఐకేఎస్)
●


