అన్నదాతల ఆర్థిక పురోగతే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

అన్నదాతల ఆర్థిక పురోగతే లక్ష్యం

Oct 13 2026 12:29 AM | Updated on Oct 13 2026 12:29 AM

గద్వాల/ అయిజ: జిల్లాలో వ్యవసాయ, అనుబంధ రంగాల్లో సామాన్య రైతులు సైతం ఆర్థికంగా పురోగతి సాధించడమే లక్ష్యంగా పీఎం ధన్‌ ధాన్య కృషి యోజనను అమలు చేస్తున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు. సోమవారం ఢిల్లీలో నిర్వహించిన పీఎం డీడీకేవై ఏడాది మైలురాయి వేడుకల్లో కలెక్టర్‌ నేతృత్వంలోని అధికారుల బృందం పాల్గొంది. ఈ సందర్భంగా వ్యవసాయ రంగంలో అమలు చేస్తున్న ఉత్తమ పద్ధతులు, వినూత్న కార్యక్రమాలు విజయవంతమైన నమూనాలపై అధ్యయనం చేశారు. ముఖ్యంగా వ్యవసాయ యాంత్రీకరణ ఆధునిక సాగు విధానాలు, వ్యవసాయ ఉత్పాదక పెంపు, సాగు వ్యయం తగ్గింపు, రైతులకు సాంకేతిక సహకారం అందించడం వంటి అంశాలపై చర్చించారు. వివిధ జిల్లాల్లో విజయవంతంగా అమలవుతున్న కార్యక్రమాలను తెలుసుకుని వాటిని జిల్లాలో స్థానిక అవసరాలకు అనుగుణంగా అమలు చేసే అవకాశాలను పరిశీలించారు. ఈ సమావేశం ద్వారా సేకరించిన అనుభవాలు, ఉత్తమ వ్వవసాయ పద్ధతులను పీఎండీడీకేవై లక్ష్యాలకు అనుగుణంగా జిల్లాలో అమలు చేయడం ద్వారా వ్యవసాయ రంగాన్ని మరింత బలోపేతం చేయడంతోపాటు రైతు ఆదాయాన్ని గణనీయంగా పెంపొందించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు వెల్లడించారు. కలెక్టర్‌ వెంట డీఏఓ వీరప్ప, వ్యవసాయ శాస్త్రవేత్త అర్చన, రైతు ప్రహ్లాదరెడ్డి ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement