దుమ్ము లేపుతున్నారు! | - | Sakshi
Sakshi News home page

దుమ్ము లేపుతున్నారు!

Jul 4 2026 2:55 AM | Updated on Jul 4 2026 2:55 AM

న్యూస్‌రీల్‌

శనివారం శ్రీ 4 శ్రీ జూలై శ్రీ 2026

–8లో u

ధరూరు: అంతర్రాష్ట్ర రహదారి రాయిచూరు రోడ్డు గుంతలమయంగా తయారైంది. అడుగడుగునా గుంతలు ఏర్పడి వాహనదారులకు పట్టపగలే చుక్క లు చూపిస్తోంది. కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలను కలిపే ఈ రోడ్డులో నిత్యం వేలాది వాహనాలు తిరుగుతూ ఉంటాయి. మోకాలి లోతు గుంతలతో వా హనదారులు ఇబ్బందులు పడుతున్నారు. ఏళ్ల తరబడిగా సమస్య ఉన్నా పట్టించుకునే వారే కరువయ్యారు. ఈ మార్గంలో వెళ్లడమంటేనే వాహనదారులు, డ్రైవర్లు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం వేసిన రోడ్డు కావడంతో అక్కడక్కడ గుంతలు ఏర్పడి వాహనాల రాక పోకలకు ఇబ్బంది కలిగిస్తోంది. అయితే సంబంధిత ఆర్‌అండ్‌బీ అధికారులు అప్పడుప్పుడు గుంతల్లో మట్టిపోసి కాలం వెల్లదీస్తున్నారు తప్ప శాశ్వత ప్రా తిపది కన పనులు చేపట్టడం లేదు. కనీసం ప్యాచ్‌ వర్క్‌లైనా చేయడం లేదని వాహనదారులు కోరుతున్నారు.

పెరిగిన వాహనాల రద్దీ..

ఇటీవల కాలంలో అంతర్రాష్ట్ర రాయిచూరు రహదారిలో రద్దీ విపరీతంగా ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్‌, జమ్ములమ్మ జాతర నేపథ్యంలో జన సంచారంతో రద్దీ పెరిగింది. మరోపక్క రోజురోజుకు వాహనాల రాకపోకలు సైతం విపరీతంగా పెరిగాయి. ఆర్‌అండ్‌బీ శాఖ అధికారులు అక్కడక్కడ ప్యాచ్‌ వర్క్‌ పనులు చేసి చేతులు దులుపుకొంటున్నారని వాహనదారులు విమర్శిస్తున్నారు. మరికొన్ని చోట్ల బీటీ రోడ్డుపై ఏర్పడిన గుంతల్లో మట్టి పోసి వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. అయితే మట్టి పోయడం వల్ల వాహన రాకపోకల సమయంలో దుమ్ము ఎగసిపడుతోంది. ఇలా చేయడం వల్ల ముఖ్యంగా ద్విచక్రవాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కళ్లలో దుమ్ము పడి ప్రమాదాల బారిన పడుతున్నారు.

అధ్వానంగా గద్వాల– రాయచూరు అంతర్రాష్ట్ర రహదారి

ఎక్కడికక్కడే ఏర్పడిన

గుంతలతో ఇక్కట్లు

తరచూ ప్రమాదాల

బారినపడుతున్న వాహనదారులు

పట్టించుకోని ఆర్‌అండ్‌బీ అధికారులు

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement