మరమ్మతు చేపట్టాలి.. | - | Sakshi
Sakshi News home page

మరమ్మతు చేపట్టాలి..

Jul 4 2026 2:49 AM | Updated on Jul 4 2026 2:49 AM

మరమ్మతు చేపట్టాలి.. త్వరలోనే పనులు..

గద్వాల– రాయిచూరు రోడ్డుకు మరమ్మతు చేపట్టాలి. నడి రోడ్డుపై ఏర్పడిన గుంతలను మట్టితో కాకుండా ప్యాచ్‌ వర్క్స్‌తో పనులు చేపట్టాలి. మట్టిపోయడం వల్ల వాహన రాకపోకల సమయంలో దుమ్ము ఎగసిపడుతోంది. కళ్లల్లో దుమ్ము పడడం వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. అధికారులు శాశ్వత ప్రాతిపదికన పనులు చేపట్టాలి.

– దావీదు, వాహనదారుడు, ధరూరు

గద్వాల– రాయిచూరు రోడ్డుకు సంబంధించి టెండరు ప్రక్రియ పూర్తయ్యింది. ఈ పనులను త్వరలోనే ప్రారంభించి పూర్తిచేసేలా చర్యలు తీసుకుంటాం. గుంతలలో మట్టి పోసి వాహనదారులకు కొంత ఇబ్బందులు లేకుండా చూస్తున్నాం.

– ప్రగతి, ఆర్‌అండ్‌బీ ఈఈ

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement