అధికారులూ.. స్పందించండి! | - | Sakshi
Sakshi News home page

అధికారులూ.. స్పందించండి!

Jun 16 2026 12:58 AM | Updated on Jun 16 2026 12:58 AM

60 రోజులుగా కేంద్రంలోనే

వరి ధాన్యం

మొలకెత్తినా పట్టించుకోని అధికారులు

పాన్‌గల్‌: ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం విక్రయించి మద్దతు ధర పొందాలని, ప్రైవేటు వ్యాపారులను ఆశ్రయించి మోసపోవద్దని అధికారులు, ప్రజాప్రతినిధులు చెబుతున్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. వివరాల్లోకి వెళ్తే.. మండలంలోని తెల్లరాళ్లపల్లి కొనుగోలు కేంద్రానికి తెల్లరాళ్లపల్లితండాకు చెందిన గిరిజన రైతులు లక్ష్మి, గోరి, పట్టెమ్మ, తొలియానాయక్‌, నర్సింహానాయక్‌ వరి ధాన్యం తీసుకొచ్చి 60 రోజులు కావస్తుంది. నేటికీ ధాన్యం తూకం చేయకపోవడంతో అకాల వర్షాలకు తడిసి మొలకెత్తింది. సోమవారం కేంద్రంలో మొలకెత్తిన ధాన్యాన్ని చూపుతూ తమ గోడు వెల్లబోసుకున్నారు. ధాన్యం కాంటా చేయడం లేదనే విషయాన్ని మండలస్థాయి అధికారులు, రెవెన్యూ అదనపు కలెక్టర్‌కు ఫోన్‌ ద్వారా సమాచారం ఇచ్చినా స్పందించడం లేదని తెలిపారు. కేంద్రంలోనే రోజుల తరబడి పడిగాపులు పడుతూ ధాన్యం కాపాడుకోవడం కష్టంగా మారిందన్నారు. ఇప్పటికై నా స్పందించి ధాన్యం తూకం చేయాలని లేకుంటే ఆత్మహత్యే శరణ్యమని వాపోతున్నారు. ఈ విషయాన్ని ఐకేపీ ఏపీఎం శ్రీనివాసులు వద్ద ప్రస్తావించగా.. హమాలీల కొరతతో ధాన్యం సేకరణలో జాప్యం జరుగుతోందని, వారి సంఖ్య పెంచి తూకం చేస్తామని, రైతులు ఆందోళన చెందవద్దన్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement