అదనపు కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ | - | Sakshi
Sakshi News home page

అదనపు కలెక్టర్‌ బాధ్యతల స్వీకరణ

May 9 2026 7:32 AM | Updated on May 9 2026 7:32 AM

గద్వాల: అదనపు కలెక్టర్‌గా (రెవెన్యూ) మధుమోహన్‌ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల ప్రభుత్వం చేపట్టిన బదిలీల్లో భాగంగా ఆయన జిల్లాకు వచ్చారు. బాధ్యతల స్వీకరణ సందర్భంగా కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయనకు వివిధ శాఖల అధికారులు పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.

నిబంధనలు

అతిక్రమిస్తే చర్యలు

కేటీదొడ్డి: ఎరువులు, విత్తన డీలర్లు ప్రభుత్వ నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయశాఖ అధికారి వీరప్ప హెచ్చరించారు. శుక్రవారం కేటీదొడ్డి మండల కేంద్రంలోని ఫర్టిలైజర్‌ దుకాణాల్లో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎరువులు, విత్తనాల స్టాక్‌ వివరాలను తెలుసుకోవడంతో పాటు పలు రికార్డులను పరిశీలించారు. స్టాక్‌ వివరాలను ఎప్పటికప్పుడు రికార్డుల్లో నమోదు చేయాలని డీలర్లకు సూచించారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు మాత్రమే విక్రయించాలని స్పష్టంచేశారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమించి రైతులకు ఇబ్బంది కలిగిస్తే సహించమని హెచ్చరించారు. ఆయన వెంట ఏఓ రాజవర్ధన్‌రెడ్డి ఉన్నారు.

వేరుశనగ క్వింటా రూ.7,071

గద్వాల వ్యవసాయం: జిల్లాకేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌యార్డుకు శుక్రవారం 67 క్వింటాళ్ల వేరుశనగ అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ. 7,071, కనిష్టంగా రూ. 3,699, సరాసరి రూ. 6,489 ధరలు లభించాయి. అదే విధంగా 63 క్వింటాళ్ల ఆముదాలు రాగా.. గరిష్టంగా రూ. 6,069, కనిష్టంగా రూ. 6,001 ధర పలికింది. 1,823 క్వింటాళ్ల వరి (సోన) రాగా.. గరిష్టంగా రూ. 2,276, కనిష్టంగా రూ. 1,621, సరాసరి రూ. 2,092 ధరలు లభించాయి.

Advertisement
 
Advertisement
Advertisement