కూల్‌పై కూపీ..!
‘సాక్షి’ కథనాలపై కదిలిన ‘అధికార’ యంత్రాంగం
దుకాణాల కేటాయింపులపై..
నగరంలోని రోడ్లపై చిరు వ్యాపారాలతో నిత్యం ట్రాఫిక్ ఇక్కట్లు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో చిరు వ్యాపారుల కోసం నగరంలోని క్లాక్‌టవర్ వద్ద పది.. మార్కెట్ రోడ్డులో మరో మూడు షెటర్లు నిర్మించిన విషయం తెలిసిందే. వీటిని వీధి వ్యాపారులకు కేటాయించాల్సి ఉండగా.. ఇందులో దుకాణానికి ఒక్కో రేటు చొప్పున ఫిక్స్ చేసి కొందరు నాయకులు వసూళ్లకు పాల్పడడం చర్చనీయాంశంగా మారింది. ఇది ఎక్కడ తమ మెడకు చుట్టుకుంటుందోననే భయంతో మున్సిపల్ కార్పొరేషన్‌కు చెందిన కొందరు ఉద్యోగులు ముఖ్య నేత దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఈ క్రమంలో సదరు ముఖ్య నేత ఆదేశాలతో ఆ శాఖ అధికారులు విచారణ చేపట్టినట్లు తెలుస్తోంది.
‘ఇంటెలిజెన్స్’ అధికారుల ఆరా..
కూల్ పాయింట్లకు సంబంధించి మద్యం షాపుల యజమానులపై ఎలాంటి ఒత్తిళ్లు తీసుకొచ్చారు.. ఎలా ఇబ్బందులు పెట్టారు.. ఏమని బెదిరించారు.. ఎవరా నాయకులు..? షటర్ల వ్యవహారంలో వసూళ్లకు పాల్పడింది ఎవరు.. ఇందులో నాయకులు, మున్సిపల్, మెప్మా శాఖల సిబ్బంది పాత్ర ఏమిటి? అని పోలీస్ ఇంటెలిజెన్స్ అధికారులు సైతం ఆరా తీస్తున్నట్లు తెలిసింది. ముఖ్య నేత ఆదేశాలతోనే వారు కూపీ లాగుతున్నారా.. లేకపోతే పై నుంచి ఆదేశాలు వచ్చాయా అనేది తెలియడం లేదు. ఇప్పటికే కూపీ లాగిన ఇంటెలిజెన్స్ అధికారులు కూల్ పాయింట్ల తతంగంలో ఓ నాయకుడి దు రుసు ప్రవర్తనే ఇందుకు ప్రధాన కారణమనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆయనతోపాటు పలువురు నాయకుల చిట్టాను వెలికితీసే పనిలో వారు నిమగ్నమైనట్లు సమాచారం. ఈ వ్యవహారాలకు సంబంధించి ఆయా శాఖల అధికారుల ను ఫోన్‌లో సంప్రదించేందుకు ‘సాక్షి’ ప్రయత్ని ంచగా.. అధికారులు అందుబాటులోకి రాలేదు.
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: ఉమ్మడి జిల్లాలోని వైన్స్ షాపుల్లో కూల్ పాయింట్లు, వీధి వ్యాపారులకు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుకాణాల కేటాయింపుల్లో చోటుచేసుకున్న దందాపై ‘అధికార’ యంత్రాంగం దృష్టిసారించింది. ప్రధానంగా మహబూబ్‌నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో కొనసాగిన బాగోతాలపై ‘కూల్‌శ్రీగా దోపిడీ’, ‘నేతల వసూళ్ల పర్వం’ శీర్షికన ‘సాక్షిశ్రీలో ప్రచురితమైన వరుస కథనాలు సంచలనం సృష్టించాయి. అధికార కాంగ్రెస్‌లోని కొందరు ద్వితీయ శ్రేణి నాయకులు నడిపించిన ఈ వ్యవహారం వెలుగులోకి రాగా.. ఆయా ప్రభుత్వ శాఖల అధికారులు కూపీ లాగుతున్నారు. దీంతో అసలేం జరుగుతోంది.. ఈ వివాదాలకు ఎవరెవరు కారణం అని పూర్తిస్థాయిలో తెలుసుకునేందుకు ప్రభుత్వ పెద్దలు సైతం నేరుగా రంగంలోకి దిగారు. తమకు పార్టీలో అత్యంత నమ్మకంగా ఉన్న వేగుల ద్వారా సమాచారం సేకరిస్తున్నట్లు తెలుస్తోంది.
ఉన్నతాధికారుల ఆదేశాలతో..
మహబూబ్‌నగర్ నగర పరిధిలో 13 వైన్స్ షాపులు ఉన్నాయి. వీటిలో కూల్ పాయింట్ల ద్వారా తమ ముఖ్య అనుచరులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో కొందరు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు పంచుకున్నారు. అయితే మాట వినని నిర్వాహకులను పలువురు ఇబ్బందులకు గురిచేయడం వివాదానికి దారితీసింది . దీనిపై కొందరు యజమానులు రాష్ట్రస్థాయిలో కాంగ్రెస్ ముఖ్యులు, ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. రూ.లక్షలు, కోట్లు పెట్టాం.. లక్ష్యం మేరకు అమ్ముతున్నాం.. నిర్ణీత కోటా దాటిన తర్వాత ఒరిగేదేమీ లేదని.. ఇప్పుడు ఇలా వేధిస్తే ఎలా అని వారు ప్రశ్నించారు. ఈ క్రమంలో ఎకై ్సజ్ శాఖ జిల్లా అధికారులకు ఉన్నతాధికారులు చీవాట్లు పెట్టడంతోపాటు ప్రాథమిక సమాచారం తీసుకున్నారు. పూర్తిస్థాయిలో నివేదిక ఇవ్వాలని ఆదేశించడంతో వారు ఆయా వైన్స్ యజమానుల నుంచి గుట్టుచప్పుడు కాకుండా వివరాలు సేకరిస్తున్నట్లు తెలిసింది.
మద్యం షాపుల్లో కూల్ పాయింట్ల వివాదంపై నజర్
నేరుగా రంగంలోకి దిగిన ‘ఎకై ్సజ్’ ఉన్నతాధికారులు
వెన్స్ దుకాణాల ఓనర్ల నుంచి వివరాల సేకరణ
‘షెటర్ల’ కేటాయింపుల్లో అక్రమాలపైనా విచారణ
పురపాలక శాఖకు ముఖ్య నేత ఆదేశాలు
ఇంతకు ఎవరా నాయకులు.. ‘ఇంటెలిజెన్స్’ ఆరా?


