రేపు బీచుపల్లిలో ఉత్తరద్వార దర్శనం
ఎర్రవల్లి: బీచుపల్లి పుణ్యక్షేత్రంలోని కోదండరామస్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని ఈ నెల 30న ఆలయంలో ఉత్తర ద్వార దర్శనానికి ఏర్పాట్లు చేయనున్నట్లు ఆలయ మేనేజర్ సురేందర్‌రాజు ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లా ప్రజలు ఉత్తర ద్వార దర్శనంలో స్వామి, అమ్మవార్ల దివ్య అనుగ్రహానికి పాత్రులు కాగలరని ఆయన కోరారు.
ముక్కోటి ఏకాదశికి
మన్యంకొండ ముస్తాబు
మహబూబ్‌నగర్ రూరల్: ముక్కోటి ఏకాదశికి మన్యంకొండ శ్రీలక్ష్మీవేంకటేశ్వరస్వామి దేవస్థానం ముస్తాబు అయ్యింది. ప్రతి ఏడాది దేవస్థానంలో ముక్కోటి ఏకాదశి పర్వదిన వేడుకలను ఘనంగా నిర్వహిస్తారు. ఈ సందర్భంగా మంగళవారం జరిగే వేడుకలకు దేవస్థానంలో అన్ని ఏర్పాట్లు చేశారు. స్వామివారు హనుమద్దాసుల మండపంలో కొలువుదీరి ఉత్తరద్వారం ద్వారా భక్తులకు దర్శనం ఇస్తారు. ఉదయం 6.30 గంటలకు స్వామివారి శేషవాహన సేవ నిర్వహిస్తారు. దిగువకొండ వద్దను న్న అలివేలు మంగతాయారు దేవస్థానంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహిస్తామని చైర్మన్ మధుసూదన్‌కుమార్ తెలిపారు.
యువత వ్యవసాయంలో రాణించాలి
మరికల్: దేశంలో అతిపెద్ద రంగమైన వ్యవసాయ రంగంలో యువత రాణించాల్సిన సమయం వచ్చిందని ప్రొఫెసర్ హరగోపాల్ అన్నారు. ఆత్మీయ రైతు దినోత్సవాన్ని పురస్కరించుకొని మరికల్‌లో రైతు మహోత్సవ వేడుకలను నిర్వహించారు. కార్యక్రమానికి ఆయన హాజరై మాట్లాడుతూ.. ప్రభుత్వాలు మారుతున్నా రైతుల తలరాత మారకపోవడం బా ధారమన్నారు. దుకాణంలో విక్రయించే వస్తువుకు ఒక ధర నిర్ణయించి అమ్ముతారు కానీ, రైతు పండించిన ధాన్యానికి వ్యాపారులు నిర్ణయించిన ధరకే విక్రయించాల్సిన పరిస్థితులు దేశంలో ఉండటంతో వ్యవసాయం రంగం అభివృద్ధి చెందడం లేదన్నారు. రైతు తాను పండించిన పంటను స్వేచ్ఛగా విక్రయించుకునే రోజులు రావాలని, అప్పుడే వారి జీవితాలు బాగుంటాయన్నారు.
రేపు బీచుపల్లిలో ఉత్తరద్వార దర్శనం


