ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యం
గద్వాలటౌన్: ఎస్జీటీ యూనియన్ నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి ఆవిష్కరించారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఎస్జీటీ యూనియన్ ఉపాధ్యాయ సంఘం క్యాలెండర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడమే లక్ష్యంగా ప్రతి ఉపాధ్యాయడు పనిచేయాలన్నారు. అక్షరాస్యతలో జిల్లాను అగ్రగామిగా నిలపాలన్నారు. విద్యా అభివృద్ధిలో ఉపాధ్యాయులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. నూతన సంవత్సరం అన్ని వర్గాల ప్రజలకు మంచి చేకూరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అంకితభావంతో విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందించాలని కోరారు. పదిలో మంచి ఫలితాలు తీసుకరావాలని సూచించారు. కార్యక్రమంలో ఎస్జీటీ యూనియన్ జిల్లా అధ్యక్షుడు గోపాల్, ప్రధాన కార్యదర్శి వినోద్, నాయకులు వెంకటయ్య, బాలరాజ్, సుమిత్ర, నిమినా నాయక్, జీవన్‌కుమార్, సోమసుందర్‌రెడ్డి,
రవీందర్‌రెడ్డి మల్లికార్జున్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.


