పల్లికి రికార్డు ధర..
● రెండు వారాల నుంచి ధరలు పైకి..
● జిల్లా నుంచి చైన్నె, మహారాష్ట్రకు ఎగుమతి
●
క్వింటా రూ.8,821 పలికిన వైనం
మంచి ధరలు
వేరుశనగను మట్టి పెల్లలు లేకుండా నాణ్యతగా తీసుకొస్తుండడంతో యార్డులో మంచి ధరలు వస్తున్నాయి. ఇక్కడికి వస్తున్న వేరుశనగను విత్తనానికి వినియోగిస్తున్నారు. అందువల్లే ధరలు బాగా వస్తున్నాయి.
– పుష్ప, జిల్లా మార్కెటింగ్ అధికారి
రెండు ఎకరాల్లో పంట సాగుచేశా
యాసంగికి ముందే రెండు ఎకరాల్లో వేరుశనగ వేశాను. చేతికి వచ్చిన పంటను కొద్ది రోజుల క్రితం విక్రయానికై యార్డుకు తీసుకెళ్లాను. క్వింటాలుకు రూ. 7800 వచ్చింది. ధర మంచిగా రావడంతో పంట ఖర్చులు పోను కొంత మిగిలింది. – సూరి, రైతు,
శెట్టిఆత్మకూర్, గద్వాల మండలం
ఆనందంగా ఉంది
ప్రతి సంవత్సరం నేను వేరుశనగ సాగు చేస్తాను. మా మండలంతో పాటు కొన్ని మండలాల్లో సంవత్సరంలో మూడు సార్లు వేరుశనగ సాగు చేస్తారు. ఏటా నవంబర్, డిసెంబర్‌లో ఇతర యార్డులకు వేరుశనగ రాదు. ఇక్కడ మాత్రమే వస్తుంది. దీనివల్ల ధరలు బాగా వస్తున్నాయి. ఆనందంగా ఉంది. – కృష్ణన్న,
రైతు, అమరవాయి, మల్దకల్ మండలం
గద్వాల వ్యవసాయం: పల్లి ధరలు పరుగెత్తుతున్నాయి. నడిగడ్డ రైతులు యాసంగి సీజన్‌కు ముందుగా వేరుశనగ వేయగా.. ఈ పంట చేతికి రావడంతో విక్రయానికి గడిచిన మూడు నెలల నుంచి గద్వాల మార్కెట్‌యార్డుకు తీసుకవస్తున్నారు. ఇలా వస్తున్న వేరుశనగకు అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు పోల్చితే నెల నెలా రికార్డు ధరలు పలుకుతున్నాయి. గరిష్టంగా రూ.8821 పలకడంతో రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలాఉండగా, వేరుశనగ పంట 90 నుంచి 100 రోజులకు చేతికి వస్తుంది. ఎకరాకు రూ.12వేల నుంచి రూ.15వేల వరకు ఖర్చు అవుతుంది. అయితే ఈసారి వానాకాలం సీజన్‌లో అధిక వర్షాల వల్ల వేరుశనగ బాగా దెబ్బతినడంతో కొన్ని చోట్ల పంటను తీసివేశారు. జిల్లాలో పలుచోట్ల అనుకున్న స్థాయిలో దిగుబడులు రాలేదు. అయితే విస్తారంగా కురిసిన వర్షాల వల్ల బోర్లు, బావులు రీచార్జ్ అయ్యాయి. దీంతో ఆగస్టు, సెప్టెంబర్‌లో దాదాపు 7వేల నుంచి 10వేల ఎకరాల్లో ముందస్తు యాసంగి సీజన్ పంటలో బాగంగా మల్దకల్, కేటీదొడ్డి, గట్టు, గద్వాల, ఇటిక్యాల, అయిజ మండలాల్లో పంట వేశారు. ఇలా వేసిన వేరుశనగ పంట అక్టోబర్ నుంచి యార్డుకు అమ్మకానికి వస్తోంది.
యా, వ,వే: యార్డుకు వచ్చిన వేరుశనగ
గద్వాల మార్కెట్‌యార్డుకు విక్రయానికి వచ్చిన వేరుశనగ
కొనుగోళ ్లు ఇలా..
పల్లికి రికార్డు ధర..
పల్లికి రికార్డు ధర..
పల్లికి రికార్డు ధర..
పల్లికి రికార్డు ధర..


