
అడిగిన సమాచారం ఇవ్వడం బాధ్యత
గద్వాల: సమాచార హక్కు చట్టం–2025 ప్రకారం పౌరులు ఆయా శాఖల నిర్ధేశిత సమాచారం నిబంధనల ప్రకారం అడిగినప్పుడు నిర్ణీత సమయంలో ఇవ్వడం అధికారుల బాధ్యత అని అదనపు కలెక్టర్ వి.లక్ష్మీనారాయణ అన్నారు. సమాచార హక్కుచట్టం కమీషన్ ఆదేశాల మేరకు సోమవారం ఐడీవోసీ కార్యాలయంలో జిల్లా స్థాయి అప్పిలేట్ అథారిటీ, పబ్లీక్ ఇన్‌ర్మేషన్ అధికారులతో సమీక్షించారు. ఇప్పటి వరకు వచ్చిన ఆర్టీఐ దరఖాస్తుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆర్టీఐ దరఖాస్తులపై ప్రతిమూడు నెలలకోసారి సమీక్షించేవాళ్లమని, ఇప్పుడు నెలకోసారి సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతినెలా వచ్చిన ఆర్టీఐ దరఖాస్తుల వివరాలను వాటికి ఇచ్చిన సమాచారం వివరాలను ఖచ్చితంగా పంపించాల్సి ఉంటుందన్నారు. అదేవిధంగా సమాచారహక్కు బోర్డులో ఖచ్చితంగా ఎప్పటికప్పుడు సంబంధిత అధికారుల వివరాలు డిస్‌ప్లే చేయాలన్నారు. ఈసమావేశంలో కలెక్టరేట్ ఏవో భూపాల్‌రెడ్డి, వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.