ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి | - | Sakshi
Sakshi News home page

ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలి

Aug 3 2026 1:07 AM | Updated on Aug 3 2026 1:07 AM

ములుగు రూరల్‌: ఈ నెల 9న జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని విజయవంతం చేయాలని ఆదివాసీ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు మంకిడి రవి పిలుపునిచ్చారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో ఆదివారం సంఘం నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివాసీలు ఐక్యంగా ఉండి హక్కుల సాధనకు పోరాటాలు చేయాలని తెలిపారు. ఆదివాసీల ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలో నిర్వహించనున్న ఆదివాసీ దినోత్సవానికి మహిళా ఉద్యోగులు, యువకులు, విద్యార్థులు స్వచ్ఛందంగా తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం గౌరవ అధ్యక్షుడు అల్లెం అప్పయ్య, ప్రధాన కార్యదర్శి అన్నవరం రవికాంత్‌, అర్రెం నారాయణ, బాబురావు, ఈక కుమారస్వామి, రామకృష్ణ, రాజేష్‌కుమార్‌, సందీప్‌, జగ్గారావు, అశోక్‌, కుమారస్వామి, రాజబాబు, రాంచందర్‌, నారాయణ, మనోజ్‌ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement