ఏటూరునాగారం: జిల్లాలోని వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో అనేక సమస్యలు కొట్టుమిట్టాడుతున్నాయి. ముఖ్యంగా బాత్‌రూమ్స్, మరుగుదొడ్లు అధ్వానంగా ఉండడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. బూత్‌రూంలకు డోర్లు ఉంటే నీళ్లు ఉండవు, నీళ్లు ఉంటే నల్లాల నుంచి వచ్చే పరిస్థితి ఉండదు. పరిసరాలు అపరిశుభ్రంగా ఉండడం వల్ల విద్యార్థుల అనారోగ్యాలకు గురవుతున్నారు. ఐటీడీఏకు కూతవేటు దూరంలోని ఆశ్రమ వసతి గృహాలు, హాస్టళ్లలో వసతులు కూడా అంతంతమాత్రమే ఉన్నాయి. గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌శాఖ అధికారులు సైతం పనులకు ప్రతిపాదనలు పంపి చేతులు దులుపుకున్న పరిస్థితి నెలకొంది.
అధికారుల నిర్లక్ష్యం
మానిటరింగ్ చేసే అధికారి లేక పనులు అన్ని కూడా పెండింగ్‌లోనే ఉన్నాయి. గతంలో ఉన్న డీఈ వీరభద్రం ఈఈగా బాధ్యతలు చేపట్టి ఈ ఏడాది జూన్ 30న పదవీ విరమణ పొందగా హైదరాబాద్‌లో పనిచేసే ఫణికుమారిని వరంగల్ ట్రైబల్ వెల్ఫేర్ సర్కిల్ ఆఫీస్‌కు ఎస్‌ఈగా ప్రమోషన్ ఇచ్చారు. దీనికితోడుగా ఏటూరునాగారం ఈఈగా అదనపు బాధ్యతలను అప్పగించారు. బాధ్యతలు తీసుకున్న నాటి నుంచి నేటి వరకు ఆయన పట్ట ణానికే పరి మితం అవుతూ గిరిజన సంక్షేమశాఖ ఇంజనీరింగ్ అధికారులు పనులు గాలికి వదిలేశారు. దీంతో క్షేత్రస్థాయిలో జరగాల్సిన నిర్మాణ పనులు చేపట్టకపోవడంతో విద్యార్థులు పడరాని పాట్లు పడుతున్నారు.
నిధులు మంజూరైనా.. మొదలు కాని పనులు
వర్షాకాలంలో గిరిజన విద్యార్థులు ఇబ్బంది పడొద్దని గిరిజన సంక్షేమశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి పలు పనుల కోసం ప్రతిపాదనలు చేసి పంపించింది. 2025 సెప్టెంబర్ 12న జీఓ నంబర్ 251 ప్రకారం పరిపాలన అనుమతి వచ్చింది. దాదాపుగా 10 నెలలు అవుతున్నా కూడా ఈ పనులు ప్రారంభించకపోవడంపై విద్యార్థుల తల్లిదండ్రులు మండిపడుతున్నారు. ఏటూరునాగారం ఎస్టీ బాయ్స్ హాస్టల్‌లో బాత్‌రూంల నిర్మాణానికి రూ.28 లక్షలతో ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైనా పనులు ప్రారంభించలేదు.
అపరిశుభ్రంగా మరుగుదొడ్లు..
నీటి సమస్య
పలుచోట్ల బాత్‌రూంలకు
డోర్లు లేని పరిస్థితి
పట్టించుకోని ఐటీడీఏ
ఇంజనీరింగ్‌శాఖ అధికారులు
వసతి గృహాలు, ఆశ్రమ పాఠశాలల్లో సౌకర్యాలు కరువు


