మేడారంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

మేడారంలో భక్తుల రద్దీ

Nov 3 2025 7:14 AM | Updated on Nov 3 2025 7:14 AM

మేడార

మేడారంలో భక్తుల రద్దీ

మేడారంలో భక్తుల రద్దీ కిక్కిరిసిన హేమాచలక్షేత్రం రేషన్‌ బియ్యం పట్టివేత ‘విద్యార్థులను విస్మరిస్తున్న ప్రభుత్వం’

ఎస్‌ఎస్‌తాడ్వాయి: మేడారం సమ్మక్క– సారలమ్మను దర్శించుకునేందుకు భక్తులు ఆదివారం వేలాది మంది తరలివచ్చారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌, మహారాష్ట్ర నుంచి భక్తులు ప్రైవేట్‌ వాహనాల్లో మేడారానికి తరలివచ్చారు. జంపన్నవాగులో స్నానాలు ఆచరించి అమ్మవార్లకు పుట్టువెంట్రుకలు సమర్పించుకున్నారు. అమ్మవార్ల గద్దెల వద్ద పసుపు, కుంకుమ, చీరసారె, ఒడిబియ్యం, కానుకలు, ఎత్తు బంగారం సమర్పించి మొక్కులు చెల్లించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తల్లుల గద్దెల ప్రాంగణం పునర్నిర్మాణంలో భాగంగా గద్దెల చుట్టూ సాలహారం నిర్మాణం పనులు సాగుతుండడంతో భక్తులను పోలీస్‌ కమాండ్‌ కంట్రోల్‌ ద్వారా మీడియా పాయింట్‌ పక్కన ఉన్న గేట్‌ నుంచి వెళ్లి అమ్మవార్లను భక్తులు దర్శించుకున్నారు. దేవాదాయశాఖ జూనియర్‌ అసిస్టెంట్లు జగదీశ్వర్‌, రమాదేవిలు భక్తులకు అందుబాటులో ఉండి సేవలందించారు. సుమారుగా 10 వేల మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు అంచనా వేశారు. మొక్కుల అనంతరం భక్తులు చెట్ల కింద వంటావార్పు చేసుకుని సహపంక్తి భోజనలు చేశారు.

మంగపేట: మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీనర్సింహస్వామి ఆలయం భక్తజనంతో కిక్కిరిసిపోయింది. కార్తీక మాసంతో పాటు ఆదివారం సెలవురోజు కావడంతో ఆలయంలోని స్వయంభువును దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. ఉదయాన్నే గుట్టపైకి చేరుకున్న భక్తులు ఆలయ సమీపంలోని పవిత్ర చింతామణి జలపాతం వద్ద పుణ్యస్నానాలు ఆచరించి భక్తి శ్రద్ధలతో ఆలయంలోని స్వయంభు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ పూజారులు స్వామివారికి తిలతైలాభిషేకం పూజలు నిర్వహించి భక్తుల గోత్ర నామాలతో ప్రత్యేక అర్చనలు జరిపించి స్వామివారి చరిత్ర, ఆలయ పురాణాన్ని వివరించారు. సంతానం కోసం వచ్చిన దంపతులకు స్వామివారి నాభిచందన ప్రసాదాన్ని అందజేసి వేదాశీర్వచనం ఇచ్చారు.

మహిళలకు వాయినం

పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని ఆలయ కార్యనిర్వహణ అధికారి రేవెల్లి మహేశ్‌ ఆధ్వర్యంలో లక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకున్న మహిళలకు కార్తీకమాసం వాయినాలను సమర్పించారు. దేవాదాయ ధర్మాదాయ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ, మంత్రి కొండా సురేఖ, కమిషనర్‌ ఆదేశాల మేరకు మహిళా భక్తులకు జాకెట్‌ ముక్కలు, తమల పాకులు, పోక, ఖర్జూర, గాజులతో కూడిన వాయినం అందజేసినట్లు తెలిపారు. అదే విధంగా భక్తులకు స్వామివారి ప్రసాదాన్ని పంపిణీ చేశారు.

కాటారం: కాటారం మండలం బయ్యారం నుంచి కొత్తపల్లి మధ్యలో వాహనంలో అక్రమంగా తరలిస్తున్న రేషన్‌ బియ్యాన్ని ఆదివారం పట్టుకున్నట్లు ఎస్సై శ్రీనివాస్‌ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. భూపాలపల్లికి చెందిన నీలిగొండ రమేశ్‌, కొత్తపల్లికి చెందిన అబ్దుల్‌ మజీద్‌ ఆటో ట్రాలీలో 8 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం సిరొంచలో విక్రయించడానికి తీసుకెళ్తున్నారు. రేషన్‌ బియ్యం అక్రమంగా రవాణా జరుగుతుందనే సమాచారం మేరకు కొత్తపల్లి వద్ద పట్టుకున్నట్లు ఎస్సై తెలిపారు. వాహనం సీజ్‌ చేసి రమేశ్‌, అబ్దుల్‌ మజీద్‌పై కేసు నమోదు చేసినట్లు ఆయన తెలిపారు.

ఏటూరునాగారం: సకాలంలో ఉపకార వేతనాలు, మెస్‌ చార్జీలను చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులను విస్మరిస్తుందని ఎస్‌ ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షుడు జాగటి రవితేజ అన్నా రు. మండల కేంద్రంలో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పెండింగ్‌ ఉపకార వేతనాలు చెల్లించాలని డిమాండ్‌ చేస్తూ ఆదివారం నాయకులు భిక్షాటన కార్యక్రమాన్ని చేపట్టి నిరసన వ్యక్తం చేశా రు. ఈ సందర్భంగా రవితేజ మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వానికి ఎన్నికలపైన ఉన్న శ్రద్ధ విద్యార్థులపైన లేదన్నారు. జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికల ప్రచారంలో సీఎం రేవంత్‌రెడ్డి పిల్ల లకు ఉన్నతమైన చదువులను అందిస్తానని హామీ ఇవ్వడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ప్రస్తుతం విద్యార్థులకు రావాల్సి న ఉపకార వేతనాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. లేని పక్షంలో రేపు మంత్రుల ఇళ్ల ముట్టడిని చేపడుతామని వెల్లడించారు.

మేడారంలో భక్తుల రద్దీ
1
1/1

మేడారంలో భక్తుల రద్దీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement