కార్తీక సందడి
కాళేశ్వరాలయంలో కార్తీక దీపాలు వెలిగించిన మహిళలు, భక్తులు
● కాళేశ్వరాలయానికి
రూ.3.56 లక్షల ఆదాయం
కాళేశ్వరం: మహదేవపూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీకాళేశ్వరముక్తీశ్వరస్వామి ఆలయంలో కార్తీకమాసం పంచరత్నాల్లో రెండవ రోజు సందర్భంగా ఆదివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం దేవస్థానం అర్చకులు మంగళవాయిధ్యాలతో గోదావరి వద్దకు వెళ్లి పూజలు చేశారు. కలశాలలో గోదావరి జలాలను తీసుకువచ్చి స్వామివారి గర్భగుడిల్లో జలాభిషేక పూజలు నిర్వహించారు. తెల్లవారుజాము నుంచే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. త్రివేణి సంగమ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి గోదావరి మాతకు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారి గర్భగుడిలో అభిషేక పూజలు చేశారు. వివిధ పూజలు, లడ్డూప్రసాదాల ద్వారా ఆలయానికి రూ.3.56 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ మహేష్ తెలిపారు. ఆదివారం సెలవు దినం కావడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. దీంతో ట్రాఫిక్ జామ్ కాకుండా ఎస్సై తమాషారెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తును నిర్వహించారు.
గోదావరికి హారతి
కార్తీకమాసం పంచరత్నాల్లో భాగంగా రెండవ రోజు సందర్భంగా త్రివేణి సంగమ గోదావరి వద్ద అర్చకులు గోదావరికి పంచరత్నహారతి కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు. సీనియర్ అసిస్టెంట్ చంద్రశేఖర్, భక్తులు పాల్గొన్నారు.
కార్తీక సందడి
కార్తీక సందడి
కార్తీక సందడి


